మాంత్రికుడిగా నాగార్జున!

సీనియర్ స్టార్‑లలో ఇప్పటికీ సూపర్ ఫాంలో ఉన్న స్టార్ హీరో కింగ్ నాగార్జున. యంగ్ జనరేషన్‑తో పోటిపడి నిలబడేందుకు ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకున్న నాగార్జున వరుస సక్సెస్‑లతో దూసుకుపోతున్నాడు. ఇటీవల ఊపిరి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ మన్మధుడు, ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో మరో భక్తిరస చిత్రం ‘ఓం నమోవేంకటేశాయ’లో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో రిలీజ్‑కు రెడీ అవుతుండగా, ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పాడు నాగ్. రాజుగారి గది సినిమాతో మంచి సక్సెస్ సాధించిన దర్శకుడు ఓంకార్, ప్రస్తుతం రాజుగారి గది 2 పేరుతో మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పీవీపీ సంస్థ భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించనున్నాడు. తెర మీద కనిపించేది కొద్దిసేపే అయినా నాగ్ పాత్రే సినిమాకు కీలకం అన్న టాక్ వినిపిస్తోంది. హర్రర్ జానర్‑లో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగ్ మాంత్రికుడి పాత్రలో కనిపించనున్నాడట. ఇప్పటికే పలు విలక్షణ పాత్రలతో ఆకట్టుకున్న నాగ్ మాంత్రికుడి పాత్రలో నటించటం ఇదే తొలిసారి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *