ఫ్రెండ్స్ తో కలిసి ఫోజిచ్చిన ఈ చిన్నది ఎవరో తెలుసా?

Ileans: ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం వల్ల సెలబ్రెటీలు కూడా సోషల్ మీడియాలో తెగ సందడులు చేస్తున్నారు. తమకు సంబంధించిన ఫోటోలను, చిన్నప్పుడు గ్యాలరీలను తెగ వదిలేస్తున్నారు. ఇదే తరుణంలో తాజాగా ఓ బ్యూటీ చిన్ననాటి ఫోటో పంచుకోగా ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారింది.

Ileans
Ileans

ఇంతకు ఆ బ్యూటీ ఎవరనుకుంటున్నారా.. ఎవరో కాదు గోవా బ్యూటీ ఇలియానా. తన సన్నని, నాజుకైన నడుము అందాలతో ‘దేవదాసు’ చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. తొలి చిత్రంలోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించి ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది.

ఆ తర్వాత వచ్చిన ‘పోకిరి’ లో కుర్ర కారుని ఓ రేంజ్ లో ఆకట్టుకుని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ‘జులయి’ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమైన ఈ భామ. ఆ తర్వాత కాస్త చబ్బీ.. గా తయారయ్యి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

ఆ తర్వాత మళ్లీ అవకాశాలు అందుకోక పోగా తన ఫిట్నెస్ పై శ్రద్ధ పెట్టి మళ్లీ మునుపటిలా తయారయింది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన పోస్టులను అప్ డేట్ చేస్తూ.. తన ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ గోవా బ్యూటీ చిన్ననాటి ఫోటోను పంచుకోగా ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. అందులో తన ఫ్రెండ్స్ తో కలిసి ఫోటోకి ఫోజులిచ్చింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *