అందరి ముందే కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ సదా.. వీడియో వైరల్

వెళ్లవయ్యా వెళ్లు.. వెళ్లు… అంటూ జయం సినిమాలో డైలాగ్‌తో ఫేమస్ అయింది సదా. అలా హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ కావడంతో ఆమె కెరీర్లో వరస సినిమా అవకాశాలు దక్కించుకున్నారు.  ‘దొంగా దొంగది’, ‘అవునన్నా కాదన్నా’, ‘అపరిచితుడు’, ‘ప్రియసఖి’ వంటి చిత్రాలతో తెలుగువారికి చేరువయ్యారు. ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉన్న ఆమె యూట్యూబ్‌, సోషల్‌మీడియా వేదికగా తన అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు పంచుకుంటున్నారు. ఈ మధ్యనే టెలివిజన్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ రీ ఎంట్రీకి ప్రయత్నిస్తున్న ఆమె తాజాగా ఒక సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా  మారింది.

Actress Sadha cried in theater while watching movie

మేజర్ సందీప్‌ ఉన్ని కృష్ణణ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ సినిమా ఇప్పటికీ సక్సెఫుల్‌గా రన్‌ అవుతోంది. రిలీజైన మొదటి రోజే భావోద్వేగాల మేజర్ అని పేరు తెచుకున్న ఈ సినిమా.. ఇప్పటికే చూసిన వారందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. దేశం కోసం మేజర్ సందీప్‌ చేసిన ప్రాణ త్యాగాన్ని కొనియాడేలా చేస్తోంది. ఇక ఇప్పటికే సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు మేజర్ సినిమాను చూసి ఎమోషనల్ అవుతున్న క్రమంలో.. తాజాగా ఈ సినిమాను ముంబైలో థియేటర్‌లో చూసిన నటి సదా.. కన్నీళ్లు ఆపులోకపోయింది. అందరూ చూస్తుండగానే ఏడ్చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా సదా మాట్లాడుతూ.. ముంబై దాడులు జరిగినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని..ఇప్పుడు ఈ సినిమా చూస్తుంటే ఆనాటి రోజులు గుర్తుకువచ్చాయని, కొన్ని సన్నివేశాల్లో రోమాలు నిక్కబొడుచుకున్నాయని అన్నారు. శశికిరణ్‌ కథను నడిపించిన విధానం, అడివి శేష్‌ నటన అద్భుతంగా ఉన్నాయని ఆమె కొనియాడారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *