అభిమానులకు షాక్ ఇచ్చిన హంసా నందిని… కేన్సర్ తో పోరాడుతున్నట్లు ప్రకటన

ప్రముఖ నటి హంసా నందిని అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. త‌న ఆరోగ్యానికి సంబంధించి ఓ పిడుగు లాంటి వార్తను వెల్లడించారు. త‌న‌కు వైద్య ప‌రీక్ష‌ల్లో క్యాన్స‌ర్ ఉన్న‌ట్లు తేలింద‌ని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ అంద‌రూ ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌వుతున్నారు. హంసా నందిని తాజాగా ఓ సోష‌ల్ మీడియా పోస్ట్ పెట్టారు. అందులో త‌న‌కు క్యాన్స‌ర్ ఉన్న‌ట్లు చెప్పుకొచ్చారు. త‌న‌కు హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ పాజిటివ్ (BRCA 1) ఉంద‌ని చెప్పారు. త‌న‌కు 70 శాతం బ్రెస్ట్, 40 శాతం అండాశ‌య క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని గ‌తంలోనే చెప్పార‌ని… ఈ క్ర‌మంలోనే త‌న‌కు బ్రెస్ట్ క్యాన్స‌ర్ వ‌చ్చింద‌ని తెలిపారు. అయితే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు స‌ర్జ‌రీలు చేయించుకోవాల్సి ఉంటుంద‌ని అన్నారు. కీమోథెర‌పీ, లుమ్పెక్టమి చేయించుకోవాల్సి ఉంటుంద‌న్నారు.

actress hamsa nandini revealed sensational fact about her health

ఇప్పటికే కీమోథెరఫీ 9 సార్లు చేయించుకున్నానని, ఇంకా 7 సార్లు చేయించుకోవాల్సి ఉంద‌ని తెలిపారు. అయితే క్యాన్స‌న్ వ‌చ్చినా తానేమీ కుంగిపోన‌ని, తాను పోరాటం చేస్తాన‌ని తెలిపారు. ఈ స‌వాల్‌ను తాను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొని తిరిగి వెండితెర‌పై క‌నిపిస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేశారు. కాగా హంసా నందిని వ‌య‌స్సు ప్ర‌స్తుతం 37 ఏళ్లు కాగా.. ఈమె గ‌త కొంత కాలంగా ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ప్ర‌స్తుతం త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఈమె పూణెలో ఉంటోంది.

4 నెల‌ల కింద‌ట హంసా నందిని త‌న బ్రెస్ట్‌లో చిన్న గ‌డ్డ‌ను గుర్తించానని… 18 ఏళ్ల కింద‌టే త‌న త‌ల్లి బ్రెస్ట్ క్యాన్స‌ర్‌తో మ‌ర‌ణించిందని చెప్పారు. దీంతో వంశ పారంప‌ర్యంగా ఈ వ్యాధి సోకే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి కాబ‌ట్టి త‌న‌కూ ఈ వ్యాధి వ‌చ్చింద‌ని వాపోయారు. అయితే తాను కొంత కాలం నుంచి సోష‌ల్ మీడియాకు, ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంటుండ‌డంతో అంద‌రూ త‌న‌కు ఏమైందోన‌ని ఆందోళ‌న చెందుతున్నార‌ని… త‌న ప‌ట్ల చూపించిన ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు అని చెప్పింది. కాగా హంసా నందిని 2004లో విడుద‌లైన ఒక్క‌ట‌వుదాం అనే మూవీతో తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది. 2018లో విడుద‌లైన గోపీచంద్ పంతం మూవీలో ఆమె చివ‌రిసారిగా క‌నిపించింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *