కూతురు లేని వెలితి అలాగే ఉందంటూ తన మనసులో మాటలను బయట పెట్టిన ఎన్టీఆర్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బుల్లితెరపై ఎవరు మీరు కోటీశ్వరులు అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించి ప్రేక్షకులను సందడి చేశారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం చివరి ఎపిసోడ్ లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారు.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మహేష్ బాబుతో ఎన్నో విషయాల గురించి ముచ్చటించి ఎంతో సరదాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మహేష్ బాబు 25 లక్షల రూపాయలను గెలుచుకున్నారు.అలాగే మధ్య మధ్యలో ఎన్టీఆర్ మహేష్ బాబు వారి వ్యక్తిగత విషయాల గురించి సినిమా విషయాల గురించి చర్చించారు.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరోల ఇద్దరినీ ఒకే వేదికపై చూడటంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఎన్టీఆర్ మహేష్ బాబు ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మీరు సినిమా షూటింగ్ సమయంలో ఎంతో బిజీగా ఉన్న ఫ్యామిలీ కోసం ఎంతో టైం స్పెండ్ చేస్తారు. అది కరోనా టైంలో కూడా ఎలా సాధ్యమైంది అంటూ అడగడంతో మహేష్ బాబు ఏడాదికి తన మూడు సార్లు తన కుటుంబంతో కలిసి వెకేషన్ కి వెళ్తాను అని తెలిపారు.

అలా కుటుంబంతో కలిసి గడిపినప్పుడే ఒకరికొకరికి మంచి అనుబంధం ఏర్పడుతుందని తెలిపారు. ఇక మహేష్ బాబు కూతురు సితార గురించి ఎన్టీఆర్ అడగడంతో మహేష్ బాబు తన కూతురు గురించి షాకింగ్ విషయాలు తెలిపారు. తన కూతురుతో గడిపే ప్రతి ఒక్క క్షణం ఎంతో అద్భుతంగా ఉంటుందని, ప్రతి సంవత్సరం ఎంతో గొప్పగా ఉంటుందని మహేష్ బాబు చెప్పడంతో ఎన్టీఆర్ ఈ మాటలకు మహేష్ బయ్యా ఈ విషయంలో మిమ్మల్ని చూస్తే చాలా ఈర్ష గా ఉంటుంది. ఇలా కూతుర్లు గురించి ఎవరైనా గొప్పగా చెబుతున్నప్పుడు తనకు కూతురు లేదనే వెలితి కలుగుతుందని ఎన్టీఆర్ తన మనసులో మాటను బయటపెట్టారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *