‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెలబ్రేషన్స్‌ సాంగ్‌ చూశారా?

సినీ ప్రియులందరూ ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. మార్చి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ మరోసారి ప్రమోషన్స్‌ షురూ చేసింది. ఇందులో భాగంగానే ఇటీవల ‘ఎత్తర జెండా’ అనే సెలబ్రేషన్‌ యాంథమ్‌ ప్రోమోను మూవీ టీం విడుదల చేసింది. పూర్తి పాటను మార్చి 14న విడుదల చేస్తామని ప్రకటించింది. నిజానికి ఈ పాటను ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్‌లా ఉంచాలనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమాపై హైప్ పెంచడానికి రిలీజ్‌కి ముందే విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సాంగ్ పోస్టర్, ప్రోమోని విడుదల చేశారు.

ఈరోజు సాయంత్రం 4 గంటలకు పూర్తి సాంగ్ ని విడుదల చేస్తామని చెప్పారు కానీ టెక్నికల్ ఇష్యూ కారణంగా వాయిదా వేశారు. ఇప్పుడు సాంగ్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ‘నెత్తురు మరిగితే ఎత్తరా జెండా’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాటను విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్ర, ఎంఎం కీరవాణి, సాహితి చాగంతి, హారిక నారాయణ్ కలిసి పాడారు. ఈ సాంగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు డ్యాన్స్‌ ఇరగదీశారు.

నిర్మాత దానయ్య రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్‌, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *