విలన్ పాత్రలో నటించడానికి సిద్ధమైన బాలయ్య.. కానీ తన పాత్ర అలా ఉండాలంటూ కండీషన్?

నందమూరి నటసింహం ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.ఆరుపదుల వయసులోకి అడుగుపెట్టిన బాలయ్య తన ఎనర్జీ కోల్పోకుండా హీరోగా ఎంతో ఎనర్జీ లెవెల్స్ తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను,బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని అందుకోవడంతో చిత్రబృందం విజయోత్సవ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా బాలయ్య కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా ఆహా ఓటీటీ ద్వారా అన్ స్టాపబుల్ అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచుతున్నారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి అఖండ చిత్రబృందం రావడంతో బాలయ్య ఎంతో హై ఎనర్జీ లెవెల్స్ తో ప్రేక్షకులను సందడి చేశారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ తనకు విలన్ పాత్రలో నటించాలనే కోరిక ఉందని తన మనసులో మాటను బయటపెట్టాడు. ఇది వరకు బాలకృష్ణ నటించిన సినిమాలలో సుల్తాన్ అనే సినిమాలో బాలకృష్ణ విలన్ పాత్రలో నటించారు. అయితే ప్రస్తుతం తాను విలన్ పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని బాలకృష్ణ వెల్లడించారు.

తాను విలన్ పాత్రలో నటించాలంటే తన పాత్ర ఎలా ఉండాలనే విషయాన్ని కూడా తెలిపారు.తాను విలన్ గా నటించే సినిమాలో హీరోగా నటించాలని నిబంధనలు పెట్టారు. బాలకృష్ణ నటించిన సుల్తాన్ సినిమాలో ఈయనే హీరో విలన్ పాత్రలో నటించారు.ఇకపై తాను విలన్ గా చేసే సినిమాలో కూడా హీరోగా తనే ఉండాలనే కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి బాలయ్య బాబు కోరికను తీర్చే దర్శకుడు ఎవరో తెలియాల్సి ఉంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *