బీటౌన్‌లో గ్రాండ్‌ పార్టీ.. లైగర్‌ టీమ్‌ హల్‌చల్‌

సెలబ్రిటీల కోసం తరచూ పార్టీలు హోస్ట్‌ చేస్తుంటారు ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌జోహార్‌. తాజాగా ఆయన ధర్మా ప్రొడెక్షన్స్‌ సీఈవో అపూర్వా మెహత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తన ఆత్మీయ మిత్రుడు అపూర్వా మెహ్తా 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా గురువారం రాత్రి బీటౌన్‌ సెలబ్రిటీలందరికీ ముంబయిలోని తన నివాసంలో గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Bollywood celebrity Birthday party at Mumbai

కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా బాలీవుడ్‌లోనూ పెద్ద స్థాయి పార్టీలు ఏవీ జరగలేదు. ఇక ఆ తర్వాత అంత భారీ స్థాయిలో జరిగిన పార్టీ ఇదే కావటం విశేషం. ఈ పార్టీలో బాలీవుడ్‌ స్టార్స్‌, వాళ్ల పిల్లలు సందడి చేశారు. షారుఖ్‌ సతీమణి గౌరీ ఖాన్‌, కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌, జాన్వీ కపూర్‌, ఆలియాభట్‌, వరుణ్‌ధావన్‌, అర్జున్‌కపూర్‌, కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌, అనన్యాపాండే, సిద్దార్థ్‌ మల్హోత్ర, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాకీ భగ్నానీ, కాజోల్‌.. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆనాటి స్టార్స్‌ నుంచి యువతరం నటీనటుల వరకూ అందరూ ఈ పార్టీలో భాగమయ్యారు.

Alia Bhatt, Ananya Panday to Janhvi Kapoor: Who wore what to Apoorva  Mehta's birthday bash | PINKVILLA

అయితే ఈ గ్రాండ్‌ నైట్‌ పార్టీలో మన రౌడీ విజయ్‌ దేవరకొండ, పూరీ, ఛార్మి కూడా పాల్గొన్నారు. విజయ్‌ నటిస్తున్న ‘లైగర్‌’ ధర్మా ప్రొడెక్షన్స్‌ బ్యానర్‌పైనే నిర్మితమవుతోన్న కారణంగా ఈ టీమ్‌కీ ఇన్విటేషన్‌ అందింది. పార్టీలో విజయ్, అనన్య పాండే మాట్లాడుకుంటున్న సమయంలో ఛార్మి వెనక నుంచి వీడియో తీసింది. ఈ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. ఇక ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *