‘ఆడవాళ్లు మీకు జోహార్లు’.. శర్వా డ్యాన్స్, రష్మిక అల్లరి చూశారా?

శర్వానంద్ – రష్మిక జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్చి 4న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా టైటిల్ సాంగ్‌ వీడియోను నటుడు రానా దగ్గుబాటి సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. సినిమా మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు.

ఇప్పటికే విడుదలైన లిరికల్‌ వీడియోకు శ్రోతల నుంచి విశేష స్పందన లభించింది. ఈ గీతానికి శ్రీమణి సాహిత్యం అందించగా.. దేవిశ్రీ ప్రసాద్‌ తనదైన శైలిలో ఆలపించి, సంగీతం అందించారు. శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చారు. ఈ గీతంలోని శర్వానంద్‌ డ్యాన్స్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో శర్వా సరసన రష్మిక నటించింది. రాధికా, ఖుష్బూ, ఊర్వశీ, ఝాన్సీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు.

ఇక సినిమాను మార్చి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం మేకింగ్‌ వీడియోను సైతం విడుదల చేసింది. షూటింగ్‌ మొత్తం ఎంతో సరదాగా జరిగినట్టు వీడియో చూస్తే అర్థమవుతోంది. చిత్రీకరణ విరామ సమయంలో రష్మిక.. బృంద సభ్యులతో కలిసి సందడి చేసింది. ఎక్కువమంది ఆడవాళ్లే కావడం వలన సెట్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేదనీ .. ఒక పిక్నిక్ కి వెళ్లి వచ్చినట్టుగా షూటింగుకి వెళ్లొచ్చానని రష్మిక ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చింది.  ప్రతి రోజు ఎంతో సరదాగా .. సందడిగా గడిచిందని అంది. ఈ వీడియో చూస్తే ఆ మాటలు నిజమే అనిపిస్తున్నాయి మరి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *