పవన్ కళ్యాణ్ గురించి తన మనసులో మాటను బయట పెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ!

తన ఖాతాలో కొన్ని సినిమాలే చేసినప్పటకీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ లో ఒక మెట్టు ఎక్కువే ఉన్న నిధి అగర్వాల్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు. సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాల్లో అంతగా గుర్తింపు పొందనప్పటికీ..

ఆ తరువాత పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ లో హీరో రామ్ తో కలిసి తన అందాలను మొత్తం ఆరబోసి ఎట్టకేలకు తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. టాలీవుడ్ లో తన అందానికై ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది.

ఆ తరువాత టాలీవుడ్ అంతగా కనిపించకపోయిన ఈ మధ్య కాలంలో హరిహరవీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన అవకాశం అందుకుంది. ఇక ఈ సినిమా పై ఈ గ్లామర్ బ్యూటి భారీ ఎత్తులో హోప్స్ పెట్టుకుందనే చెప్పొచ్చు.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియా బాగా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన పోస్టులు అప్డేట్ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో అస్క్ నిధి అని టైం పాస్ చిట్ చాట్ స్టార్ట్ చేసింది. దీంతో ఫాన్స్ ఎక్కడ ఆగుతారు.. వెంటనే ప్రశ్నల వర్షం కురుపించారు.

అందులో కొంత మంది పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు గురించి ప్రశ్నలు అడుగుతుండగా వాటికి ఏ మాత్రం చిరాకు పడకుండా ఆన్సర్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ తో నటించడం తన అదృష్టమని.. అయన వన్ మెన్ ఆర్మీ అని.. దేవుడు ఆశీస్సులతో కలిగిన వ్యక్తి పవన్ సార్ అంటూ.. పొగడ్తల వర్షం కురిపించింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *