అలియా భట్‌ కోసం థియేటర్‌ మెుత్తం బుక్‌ చేసుకున్న పాకిస్థాన్‌ నటుడు

బాలీవుడ్‌ క్యూట్‌ బ్యూటీ అలియా భట్‌ ఇటీవల నటించి మెప్పించిన చిత్రం ‘గంగూబాయి కతియవాడి’. బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. మాఫీయా క్వీన్‌, వేశ్య పాత్రలో అలియా తన అందం, అభినయం, డైలాగ్‌లతో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ఇప్పటివరకు గ్లామర్‌ రోల్స్‌తో అలరించిన ఈ బ్యూటీ ఈ సినిమాలో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను, విమర్శకులను ఆశ్చర్యపరిచింది. దీంతో అలియా అభిమానులు సంఖ్య ఎల్లలు దాటింది.

pakisthan actor book entire theatre to watch alia bhatt movie

అలియా భట్‌కు కేవలం ఇండియాలోనే కాదు.. పక్కనున్న పాకిస్తాన్‌లో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ఇందుకు తాజా ఘటనే నిదర్శనం. పాకిస్తాన్‌కు చెందిన మోడల్‌, యాక్టర్‌ మునీబ్ బట్‌ అలియా భట్‌కు వీరాభిమాని అట. ‘అలియా భట్ సపోర్టర్స్ ఆన్‌లైన్’లో అనే ఇన్‌స్టగ్రామ్ పేజ్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. తన భార్య అయిమాన్‌ ఖాన్‌తో కలిసి ‘గంగూబాయ్’ చిత్రం చూసేందుకు మునీబ్ ఏకంగా సినిమా హాల్ మొత్తాన్ని బుక్ చేశాడట. అనంతరం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌ అయింది.

pakisthan actor book entire theatre to watch alia bhatt movie

ఏది ఏమైనా.. ఇండియన్ హీరోయిన్ కోసం పాకిస్తాన్ అభిమాని ఇలా హాల్ మొత్తాన్ని బుక్ చేయడమంటే నిజంగా చిత్రమే. ఇక పాన్ ఇండియా చిత్రం RRRలో కూడా అలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రేపు విడుదల కాబోతుంది. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *