నేషనల్ అవార్డ్ డైరెక్టర్‌తో రోషన్‌ నెక్ట్స్ మూవీ..!

‘నిర్మలా కాన్వెంట్’, ‘పెళ్లి సందD’ వంటి సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్. అయితే ఈ రెండు సినిమాలు కూడా రోషన్ కి సరైన సక్సెస్‌ను తీసుకురాలేకపోయాయి. ఈ సినిమా తర్వాత.. రోషన్ తదుపరి చిత్రాల గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా రోషన్ తదుపరి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దీంతో ఈసారి నేషనల్ అవార్డ్ విన్నర్‌ను రంగంలోకి దింపుతున్నారు. తన షార్ట్ ఫిలిమ్స్, డాక్యూమెంటరీలతో ఆకట్టుకున్న దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లో యంగ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ తన ప్రొడక్షన్ నెం 9 చిత్రాన్ని ప్రకటించింది. రోషన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ఈ ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించారు.ఇందులో రోషన్‌ను వెనక నుంచి చూపించారు. ఓ బ్యాగ్ పట్టుకొని గ్రౌండ్‌లోకి ఎంటర్ అవుతున్నట్లుగా కనిపించాడు రోషన్. పోస్టర్‌ని చూస్తుంటే పీరియాడిక్ లుక్ మాదిరి అనిపిస్తోంది. మరి సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

roshan next project with vyjayanthi movies first look released

ఓ పక్కన ‘ప్రాజెక్ట్ K’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూనే.. మరోపక్క చిన్న బడ్జెట్ సినిమాలను నిర్మిస్తుంది వైజయంతీ మూవీస్ సంస్థ. ఈ బ్యానర్ లో వచ్చిన ‘జాతిరత్నాలు’ సూపర్‌ హిట్‌ అయిన విషయం తెలిసిందే. అందుకే చిన్నా పెద్దా తేడా లేకుండా కొత్తదనాన్ని ఎంకరేజ్‌ చేస్తుంది ఈ నిర్మాణ సంస్థ.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *