ఫిబ్రవరి 14న కలవబోతున్న షణ్ముఖ్, దీప్తి!

Shanmukh And Deepti : సోషల్ మీడియా ప్రియులకు దీప్తి, షణ్ముఖ్ ల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిరువురి లవ్ బాండింగ్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. యూట్యూబ్ లో ఈ జంట చేసే హడావిడి అంతా ఇంతా కాదు. నేటి తరం యువతకు ఈ జంట ఆదర్శంగా నిలిచి ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో మంచి ఫేమ్ సొంతం చేసుకున్నారు.

Shanmukh And Deepti
Shanmukh And Deepti

ఇక ఇటీవల వచ్చిన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కారణంగా ఈ జంట బ్రేకప్ కంచె కట్టుకుంది. నెటిజన్ల నుండి సెలబ్రేటీలు సైతం ఈ బ్రేక్అప్ ను జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికీ కొందరు ఈ జంట విడిపోవడాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ జంట మళ్లీ కలవబోతున్నారు అనే పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఎలా కలుస్తారు అనే వివరాల్లోకి వస్తే.

మళ్లీ బిగ్ బాస్ ద్వారానే కలుస్తారని తెలుస్తుంది. బిగ్ బాస్ ఉత్సవం పేరుతో వాళ్ళు మాజీ కంటెస్టెంట్స్ అందర్నీ ఇన్వైట్ చేస్తారు అని తెలుస్తుంది. వీళ్లతో పాటు సీజన్ ఫైవ్ విన్నర్స్ ను రన్నర్స్ ను కూడా ఆహ్వానించారు తెలుస్తోంది. దాదాపు బిగ్ బాస్ ఉత్సవం షూటింగ్ కూడా చాలా వరకు పూర్తి అయిందని తెలుస్తుంది.

ఈ ఉత్సవానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నాయి. ఇక బిగ్ బాస్ ఉత్సవం సెకండ్ పార్ట్ ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజూ సందర్భంగా ప్రసారమవుతుంది. మరి ఈ సెకండ్ పార్ట్ లో షన్నూ- దీప్తి లు నిజంగానే కలుస్తారో లేదో తెలవాలి అంటే వేచి చూడాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *