పవన్ సినిమాల క్రేజే వేరు.. ఏకంగా ఆడియో హక్కులకే ఫ్యాన్సీ రేటు!

టాలీవుడ్ ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన దక్కించుకున్న క్రేజ్ లెక్కలేనంత. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Pawan Kalyan
Pawan Kalyan

ఇక పవన్ కళ్యాన్ ప్రస్తుతం . భీమ్లా నాయక్ తో బిజీగా ఉన్నాడు. దీనికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాను త్రివిక్రమ్ ముందుండి నడిపిస్తున్నాడు. ఇక తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా ఆడియో హక్కులను టిప్స్ సంస్థ ఐదున్నర కోట్ల రూపాయలకు తన సొంతం చేసుకుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

భీమ్లా నాయక్ లిరికల్ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో తెగ హడావిడి చేస్తోంది. దీనిపై ఐదున్నర కోట్లు ఆడియో హక్కులు రావడం అంటే చాలా గొప్ప విషయమని చెప్పవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ రెండో సినిమా ‘హరి హర వీర మల్లు’ షూటింగ్ ముగింపుకు దగ్గరగా ఉంది. జాగర్లమూడి క్రిష్ దీనికి దర్శకత్వం వహిస్తుండగా.. ఎం.ఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఇక ఈ చిత్రానికి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమా ఆడియో హక్కులను కూడా టిప్స్ సంస్థ తన సొంతం చేసుకుంది. ఈ సినిమా ఆడియో హక్కులను నాలుగున్నర కోట్ల రూపాయలకు తన సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరే స్థాయిలో ఉంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *