‘ఏ మాయ చేశావే’ సినిమాపై సమంత ఎమోషనల్‌ పోస్ట్..!

‘ఏ మాయ చేశావే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత అంచెలంచెలుగా ఎదిగి స్టార్ స్టేటస్ పట్టేసింది. 2010లో విడుదలైన ఈ సినిమాతో సమంత కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్యతో జోడీ కట్టింది సమంత. అయితే నేటితో ఈ సినిమా విడుదలై 12 ఏళ్ళు పూర్తి కావడంతో తన జర్నీ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది సామ్.

‘చిత్ర పరిశ్రమలో నటిగా నా ప్రయాణం మొదలై నేటితో 12 సంవత్సరాలైంది. లైట్స్‌, కెమెరా, యాక్షన్‌.. వీటి చుట్టూ నాకున్న మధుర జ్ఞాపకాలు, అద్భుతమైన అనుభూతులకు 12 ఏళ్లు. ఇన్నేళ్ల గొప్ప ప్రయాణం, ప్రపంచవ్యాప్తంగా నిస్వార్థమైన అభిమానులను పొందినందుకు ఆనందంగా ఉంది. కెమెరాతో నా ప్రేమకథ ఇలాగే ఎంతోకాలం కొనసాగాలని కోరుకుంటున్నా’’ అని సమంత పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

samantha intresting comments on her 12 years of journy

ఈ సినిమా కోసమే నాగచైతన్య-సమంత మొదటిసారి కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్‌లోనే వాళ్లిద్దరూ స్నేహితులయ్యారు. తొలి సినిమాలో హీరోతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. కానీ కేవలం నాలుగేళ్లే వివాహ బంధం కొనసాగించి రీసెంట్‌గా విడాకుల ప్రకటన చేసి అభిమానులకు షాకిచ్చారు. కారణం ఏదైనప్పటీకీ బ్యూటిఫుల్ జోడీ చై- సామ్ విడిపోవడం ఫ్యాన్స్ నేటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక విడాకుల ప్రకటన తర్వాత వరుస సినిమాలతో బిజీ అయింది సమంత. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమా పూర్తి చేసిన ఆమె త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు ‘యశోద’ అనే సినిమాలో లీడ్ రోల్‌లో నటిస్తోంది సామ్. మరోవైపు వెబ్ సిరీసులు, బాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటించేందుకు సామ్ ఇంట్రెస్ట్ చూపుతోంది .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *