విజయ్‌తో ప్రేమ, పెళ్లిపై రష్మిక ఏమందంటే…!

స్టార్‌ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నపెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కొన్నిసార్లు బయట కనిపించడంతో ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవలే విజయ్‌ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఏదో రెండు సినిమాలు క‌లిసి న‌టించినంత మాత్రానా ఏదో ఉంద‌నుకోవ‌డం అవివేక‌మే అని ఎవ‌రెన్ని కొట్టి పారేసినా కూడా వాళ్లు న‌డుచుకునే తీరును బ‌ట్టి కూడా అనుమానాలు వ‌స్తుంటాయి.

rashmika responds on rumours with vijay devarakonda

గీత‌ గోవిందం స‌మ‌యంలోనే విజయ్‌, రష్మిక మ‌ధ్య స్నేహం ఏర్ప‌డింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్‌తో అది నెక్ట్స్ లెవల్‌కు వెళ్లిపోయింది. అప్పట్లో తానేం చేసినా.. ఎక్కడికి వెళ్లినా ర‌ష్మిక‌ను తోడు తీసుకెళ్లేవాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. డియ‌ర్ కామ్రేడ్ తర్వాత ఇద్దరూ మళ్లీ కలిసి నటించలేదు. అయినా కూడా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మాత్రం అలాగే ఉంది. వీరిద్దరి ప్రేమాయాణంపై బాలీవుడ్‌లో కూడా రూమర్స్‌ రావటంతో విజయ్‌కి ఓ రేంజ్‌లో కోపమొచ్చినట్టుంది. మరోసారి నాన్సెన్స్ న్యూస్ అంటూ రెచ్చిపోయాడు. దానికి ఓ బూతు ట్వీట్ కూడా చేసాడు విజయ్. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక సైతం ఈ రూమర్లపై స్పందించింది.

rashmika responds on rumours with vijay devarakonda

ఆమె తాజాగా నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ మూవీ మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రష్మిక మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్య్వూలు ఇస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలో రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో విజయ్‌తో ఆమె పెళ్లి అంటూ వస్తున్న రూమర్లపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. ఇక దీనికి రష్మిక.. ‘ఆ వార్తలు నా దృష్టికి కూడా వచ్చాయి. ఇలాంటివి రూమర్లు నాకు కొత్తకాదు. వాటిని విని నవ్వుకోవటం అలవాటైపోయింది. ప్రేమించి, పెళ్లి చేసుకునేంత సమయం నా దగ్గర లేదు’ అంటూ సమాధానం ఇచ్చింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *