పవన్‌ని సీఎం చేస్తానన్న కేఏ పాల్‌.. ఆర్జీవీ ఏమన్నాడంటే..!

కేఏ పాల్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఏపీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా రంగంలోకి దిగారు. 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి అప్పుడప్పుడు తప్ప.. పెద్దగా ఎక్కడా కనిపించింది లేదు.. పూర్తిగా విదేశాలకు పరిమితం అయ్యారు. అలాంటి పాల్ మరోసారి యాక్టివ్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా తెలుగు రాష్ట్రాల్లో పరిణామాలపై స్పందిస్తున్నారు.

తాజాగా ఆయన కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. నిన్న సాయంత్రం ఆయన ఫేస్‌ బుక్‌ లైవ్‌ సెషన్‌ నిర్వహించారు. ఇందులో ఆయన తనదైన శైలిలో మాట్లాడి మళ్లీ వైరల్‌గా మారారు. అయితే ఆయన చేసిన షాకింగ్‌ వ్యాఖ్యలు కొన్నింటిని నెటిజన్లు తెగ షేర్‌ చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. ఇందులో కేఏ పాల్‌ మాట్లాడుతూ “పవన్ కల్యాణ్ ముఖ్యమంతి కావాలన్నా, మంత్రి అవ్వాలన్నా.. ఒక ఉపాయం ఉంది. పవన్ అభిమానులందరికీ నేను చెబుతున్నా.. మీకు కనీసం ఒక్క శాతం నీతి, నిజాయతీ ఉన్నా పవన్ కల్యాణ్‌ను మా ప్రజాశాంతి పార్టీలో చేరమని చెప్పండి. 42 మంది ఎంపీలను గెలిపించుకుని, మీరు ‘ఎస్’ అంటే నేనే ప్రధాన మంత్రి అవుతాను. కావాలంటే పవన్ కల్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిని చేసేద్దాం. దాంట్లో తప్పేముంది?” అంటూ చెప్పుకొచ్చారు. చాలా సేపు పాల్ మాట్లాడినా.. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన షార్ట్ వీడియో మాత్రం ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.

అయితే ఈ వీడియోను మన సంచలన దర్శకుడు రాం గోపాల్‌ వర్మ షేర్‌ చేయటంతో మరింత ట్రెండ్‌ అవుతుంది. అసలు ఆర్జీవీ ఏమన్నాడంటే.. ‘‘హే.. పవన్ సర్! కాబోయే పీఎం కేఏపాల్‌ చెబుతున్నారు విను” అంటూ క్యాప్షన్‌ని జత చేశారు. ఆ వీడియోను కూడా జత చేశారు. ఆర్జీవీ గతంలో కూడా చాలాసార్లు పవన్‌ కల్యాణ్‌, కేఏ పాల్‌ విషయంలో తనదైన శైలిలో స్పందించారు. ఇటీవలే పవన్‌ భీమ్లా నాయక్‌ సినిమా తనకు తెగ నచ్చిందని.. సినిమా అంతా ఉరుములు, మెరుపులు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఇప్పుడు కేఏ పాల్‌ వీడియో పెట్టి పవన్‌ గురించి ట్వీట్‌ చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *