విశ్వక్‌ సేన్‌, యాంకర్‌ గొడవపై స్పందించిన ఆర్జీవీ

యువ హీరో విశ్వక్​ సేన్​ కథానాయకుడిగా రుక్సార్​ దిల్లాన్​ హీరోయిన్​గా నటించిన చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్​ స్పీడ్​ పెంచింది చిత్ర బృందం. ఈ క్రమంలో పబ్లిసిటీ కోసం హీరో విశ్వక్ సేన్ తాజాగా ఓ ప్రాంక్ వీడియోను వదిలాడు. అయితే, అది పెద్ద వివాదమై కూర్చొంది. రోడ్డుపై ఆ న్యూసెన్స్ ఏమిటని కొందరు, ఆత్మహత్యలను ప్రోత్సాహిస్తున్నావా? అని మరికొందరు విశ్వక్ సేన్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీనిపై అరుణ్ కుమార్ అనే అడ్వకేట్.. విశ్వక్ సేన్ మీద హెచ్ఆర్‌సిలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అభిమాని సూసైడ్ పేరుతో ప్రాంక్ వీడియో చేసిన విశ్వక్ మీద చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును కోరినట్లు తెలిసింది.

RGV comments on vishwaksen and anchor fight

కాగాఈ విషయంపై ప్రముఖ న్యూస్‌ ఛానల్‌లో డిబేట్‌ నిర్వహించారు. అయితే ఈ డిబెట్​లో యాంకర్​కు విశ్వక్​ సేన్​ మధ్య మాటల యుద్ధం జరిగింది. విశ్వక్​ సేన్​ను స్టూడియో నుంచి ‘గెట్​ అవుట్’​ అంటూ యాంకర్ గట్టిగా అరిచిన వీడియో ప్రస్తుతం నెట్టింట షేక్ చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్​ టాపిక్​గా మారింది. ఈ వీడియోపై తాజాగా సంచలన డైరెక్టర్​ రామ్​ గోపాల్​ ట్విటర్ వేదికగా స్పందించారు.

అయితే, ఆర్జీవీ.. హీరో విశ్వక్ సేన్‌కు కాకుండా ఆ టీవీ చానల్ ప్రతినిధికి సపోర్ట్ చేస్తూ అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. ‘‘పురుషుడి కంటే చాలా శక్తివంతమైన స్త్రీని నేను ఎప్పుడూ చూడలేదు. ఆమె సర్కార్ కంటే తక్కువ కాదు’’ అని పొగిడేశారు. దీంతో నెటిజనులు ఆర్జీవిని ట్రోల్ చేస్తున్నారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *