హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖులు వీళ్లే..!

మనం రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.అయితే ఈ ప్రమాదాలు జరిగిన సమయంలో కొన్నిసార్లు మన అదృష్టం బాగుంటే బయటపడతాము లేదంటే మన ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. కానీ ఆకాశంలో ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే నని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ మధ్య కాలంలో హెలికాఫ్టర్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటం వల్ల హెలికాప్టర్ ప్రయాణాలు చేయాలంటే కూడా ఎంతో భయపడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి.

హెలికాప్టర్ ప్రయాణం చేయడానికి ముందు అన్ని సవ్యంగా ఉన్నాయని బయలుదేరిన ఏదో ఒక రూపంలో మృత్యువు వెంటాడుతోంది. ఇలా హెలికాఫ్టర్ ప్రమాదం లో ఎంతో మంది రాజకీయ నేతలు సినీ ప్రముఖులు మరణించారు. తాజాగా తమిళనాడులోని జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ అతని భార్యతో సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్రువీకరించింది. ఇక హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖుల విషయానికి వస్తే..

సంజయ్ గాంధీ 1980 జూన్ 23వ తేదీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. కాంగ్రెస్ సీనియర్ నేత జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్న
మాధవరావు సింథియా 2001 సెప్టెంబర్ 30వ తేదీ కాన్పూర్ లో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం ధోర్జీ ఖండూ హెలికాప్టర్‌ ప్రమాదంలో 2011 ఏప్రిల్‌ 30న మరణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నల్లమల అడవులు పావురాలగుట్టలో సెప్టెంబర్ 2 2009 న హెలికాప్టర్ కూలి మృతి చెందారు. తెలుగుదేశం పార్టీ నేత జీఎంసీ బాలయోగి హెలికాప్టర్‌ ప్రమాదంలో అనూహ్యంగా మరణించారు. ప్రముఖ సినీ నటి సౌందర్య 2004 ఏప్రిల్‌ 17న బెంగళూరులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *