‘నిన్న ప్రెగ్నెంట్‌ చేస్తా’ అన్న నెటిజన్‌కు సమంత దిమ్మతిరిగే కౌంటర్‌

సోషల్ మీడియా ట్రోల్స్‌ని ఎదుర్కోవడం సెలెబ్రిటీలకు పెద్ద తలనొప్పి. కొన్నిసార్లు ఈ కామెంట్స్ హద్దులు దాటి పోతాయి. చాలామంది ఇటువంటి ట్రోల్స్‌ని చూసి, చూడనట్టు వదిలేస్తారు. మరికొందరు స్ట్రాంగ్‌ రిప్లేస్‌ ఇచ్చి వాళ్ల ఆటకట్టిస్తారు. నెటిజన్ల ట్రోల్స్‌కి దిమ్మతిరిగే జవాబులు ఇచ్చిన సెలెబ్రిటీస్‌ చాలా మందే ఉన్నారు.

samantha strong repiled to the trolls

టాలీవుడ్‌ అగ్ర కథానాయిక సమంతకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. వరుస సినిమాలతో బిజీ ఉన్న ఈ ముద్దుగుమ్మ అటు సినిమాలు చేస్తూనే గ్యాప్‌ దొరికినప్పుడంతా ట్రిప్‌లకు చెక్కేస్తుంది. సోషల్‌ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే సామ్‌.. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది. తాజాగా సమంత తన ఇన్ స్టా అకౌంట్ పేజీలో ఆస్క్ మీ ఎనీథింగ్ అనే సెషన్ నిర్వహించింది. అందులో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పింది.అయితే ఓ నెటిజెన్స్ దారుణమైన ప్రశ్న అడగ్గా… ఆమె స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చింది.

samantha strong repiled to the trolls

‘సమంత మీరు ఇప్పటి వరకు తల్లి అయ్యారా? లేదంటే నేను తల్లిని చేస్తాను’.. అంటూ అనుచిత ప్రశ్నలు వేశారు. సదరు ప్రశ్నను వదిలేయకుండా సమంత సమాధానం చెప్పారు. ‘రీప్రొడ్యూస్‌ అంటే ఏంటో ఒక వాక్యంలో చెప్పగలవా? ముందు ఆ పదానికి గూగుల్‌ చేయాల్సింది’ అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో పాటు మరికొన్ని ప్రశ్నలకు సామ్‌ సమాధానం ఇచ్చింది. బెన్‌ బోహ్మర్‌, రాబ్‌ మూసేల ‘హోమ్‌’ తన ఫేవరెట్‌ సాంగ్‌ అని, తనకు కామెడీ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. ఎప్పటికీ గుర్తుండిపోవటమే తన జీవిత లక్ష్యమని తెలిపింది. మీరు బాగానే ఉన్నారా? అని మరో నెటిజన్‌ ప్రశ్నించగా, ‘అలా అడిగినందుకు ధన్యవాదాలు.. నేను బాగానే ఉన్నా’ అని సమాధానం ఇచ్చింది. సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’, ‘యశోద’ చిత్రాలతో పాటు, ఓ వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *