తన భాగస్వామి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రకుల్

దక్షిణాది, బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ స్టార్‌హీరోయిన్‌గా రాణిస్తున్నారు నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఇటీవల ‘రన్‌ వే 34’తో బీటౌన్‌ ప్రేక్షకుల్ని అలరించిన ఆమె తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కెరీర్‌ పరంగా తాను ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు. అనంతరం తన ప్రేమ గురించి స్పందిస్తూ.. ప్రియుడు జాకీ భగ్నానీ మంచి మనసున్న వ్యక్తి అని అన్నారు.

Rakul Preet Singh reveals why she didn't hide her relationship with jackky

జాకీ తనకు మంచి స్నేహితుడని.. ఇద్దరి అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డామని చెప్పింది. తమ మధ్య రిలేషన్ షిప్ మొదలయినప్పుడే తమ బంధం గురించి వీలైనంత ఎక్కువగా బయటి ప్రపంచానికి తెలియజేయాలనుకున్నామని తెలిపింది. తమ రిలేషన్ షిప్ గురించి తాము బయటపెట్టకపోతే… అసత్య ప్రచారాలు జరుగుతాయని, వాటితో ప్రశాంతతను కోల్పోతామని రకుల్ చెప్పింది. అందరూ తమ పని గురించి మాట్లాడుకోవాలని… తమ పర్సనల్ లైఫ్ గురించి కాదని వ్యాఖ్యానించింది. మన జీవితాల్లో తల్లిదండ్రులు, సోదరీసోదరులు, స్నేహితులు ఎలా ఉంటారో… అలాగే మనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తి కూడా ఉంటాడని చెప్పింది. సెలబ్రిటీల జీవితంపై అందరూ దృష్టి సారిస్తారని… అందుకే తాము తమ రిలేషన్ షిప్ గురించి బహిరంగంగా చెప్పేశామని తెలిపింది.

Rakul Preet Singh reveals why she didn't hide her relationship with jackky

నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో తాను ప్రేమలో ఉన్నానంటూ గతేడాది రకుల్‌ తెలిపారు. గతేడాది రకుల్‌ పుట్టినరోజు నాడు ఆమెతో దిగిన ఓ ఫొటోని జాకీ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ.. ఆమె వల్ల తన జీవితంలో ఎన్నో వెలుగులు వచ్చాయని అన్నారు. వీళ్లిద్దరూ తమ ప్రేమను ప్రకటించిన నాటి నుంచి వీరి పెళ్లి కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *