నాని కొత్త సినిమా టీజర్‌ చూశారా..!

నేచురల్‌ స్టార్‌ నాని నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’ . వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

Nani ante sundaraniki movie teaser

నాని ఈ సినిమాలో ‘K.P.V.S.S.P.R సుందర ప్రసాద్’ అనే పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎప్పటిలానే నాని తన నేచురల్‌ కామెడీతో అలరించాడు. ‘మీకింకా అసలు విషయం చెప్పలేదంటూ’ నాని నవ్వులు పూయిస్తూ ‘సెలబ్రేట్‌ ది మ్యాడ్‌నెస్‌ ఆఫ్‌ లవ్‌, లాఫ్టర్‌ అండ్‌ ఫ్యామిలీ’ అంటూ సాగే ఈ టీజర్‌ సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది.  ఈ చిత్రంలో నాని సరసన మలయాళ భామ నజ్రియా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు లీలా థామస్. కంప్లీట్‌ ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది ఈ సినిమా.

మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని – యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక నాని చాలా కాలంగా హిట్స్ కోసం ఎదురుచూసిన నాని ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. “అంటే.. సుందరానికీ!” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న వివేక్ ఆత్రేయ … ‘బ్రోచేవారేవరురా’ ‘మెంటల్ మదిలో’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *