గని మూవీ స్పెషల్‌ సాంగ్‌.. డ్యాన్స్‌తో అదరగొట్టిన తమన్నా..!

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గని. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ సయూ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్‌ సాంగ్‌కి స్టెప్పులేసిన విషయం తెలిసిందే. ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’, ‘జాగ్వార్‌’, ‘జై లవకుశ’, ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ వన్‌’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల్లో తమన్నా స్పెషల్‌ సాంగ్స్‌ చేసి అలరించింది. తాజాగా గనిలో ఆమె డ్యాన్స్‌ చేసిన కొడ్తే ఫుల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు.

varun tej ghani movie special song release

‘కొడితే…’ అంటూ సాగే ఆ గీతాన్ని రెండు నెలల క్రితమే విడుదల చేయగా.. తాజాగా ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. తమన్నా గ్లామర్, డాన్స్ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. తమన్ సంగీతంలో హారికా నారాయణ్ ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. ఈ పాటను కూడా బాక్సింగ్ రింగ్‌లో షూట్ చేశారు. ఎప్పటిలానే తమన్నా డ్యాన్స్‌ అందరినీ ఆకట్టుకుంది. రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ పాటను హారికా నారాయణ్‌ ఆలపించింది. తమన్‌ స్వరాలందించారు. బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

కాగా వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం ప్రొఫెషనల్ బాక్సింగ్ ట్రెయినింగ్ తీసుకున్నాడు. ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించేందుకు వరుణ్ భారీ వర్కవుట్స్ చేసి చక్కటి ఫిజిక్‌లోకి వచ్చాడు. ఇక జగపతిబాబు, ఉపేంద్ర, నవీన్‌ చంద్ర, సునీల్‌శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించారు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 8న విడుదలకానుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *