రొమాంటిక్ ఎంటర్టైనర్‌ సమ్మతమే టీజర్‌ చూశారా..!

వినూత్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ త‌న న‌ట‌న‌, అభిన‌యంతో సినీరంగంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం.  ‘రాజావారు రాణి గారు’, ‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవ‌లే సెబాస్టీయన్ వంటి వినూత్న క‌థతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. ప్ర‌స్తుతం కిర‌ణ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం స‌మ్మ‌త‌మే.

kiran abbavarams sammathame teaser out

గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ స‌మ్మ‌త‌మే సినిమాను రూపొందిస్తున్నారు. గతంలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్‌ రాగా తాజాగా సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఐ లవ్‌యూ కృష్ణ అంటూ ఓ అమ్మాయి ప్రపోజల్‌తో టీజర్‌ మొదలవుతుంది. దానికి హీరో పెళ్లికి ముందు ప్రేమ పడదండీ, అందులో నేను పడను అంటూ తన క్యారెక్టర్ గురించి చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ తనకు తెలీకుండానే హీరోయిన్‌తో ఎలా లవ్‌లో పడ్డాడు? అసలది ప్రేమే అని ఎలా తెలుసుకున్నాడనే విషయాలను టీజర్ లో చూపించారు. ఆ తరువాత ఏం జరిగిందనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకొంటోంది. జూన్‌ 24న ‘సమ్మతమే’ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కె.ప్రవీణ నిర్మిస్తున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో కిరణ్‌కు జోడీగా తెలుగమ్మాయి చాందిని చౌదరి నటించింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *