‘ఆచార్య’ మిక్సిడ్‌ టాక్‌.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?

పలు వాయిదాల అనంతరం మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య మూవీ నేడు(ఏప్రిల్‌ 29) థియేటర్లోకి వచ్చింది. మల్టీస్టారర్‌ అంటేనే ఆ మూవీపై ఎన్నో అంచనాలు నెలకొంటాయి. అలాంటిది మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ ఒకే సినిమాలో కనిపంచడమంటే హైప్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా ఎన్నో అంచనాల మధ్య నేడు విడుదలైన ఆచార్య మూవీ బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంటుంది. మెగాఫ్యాన్స్‌కు ఈ సినిమా నచ్చుతుందని.. కానీ జెనరల్ ఆడియన్స్‌ని ఈ సినిమా మెప్పించలేక పోయిందని అంటున్నారు. ఈ విషయంలో దర్శకుడు కొరటాల శివను టార్గెట్ చేస్తూ.. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు.

Chiranjeevi and Ram Charan's Acharya to arrive on THIS OTT platform?

అయితే ఓవైపు థియేటర్లలో ఆచార్య సందడి చేస్తుండగా.. మరోవైపు ఆచార్య ఓటీటీ ఎంట్రీకి సంబంధించిన వార్త చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్స్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లో విడుదలైన మూడు వారాల అనంతరం ఆచార్య ఓటీటీలో రానుందని టాక్. మే చివరి వారంలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో నెగెటివ్ టాక్ వచ్చిన సినిమాలను ముందే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ‘రాధేశ్యామ్’, ‘గని’ సినిమాల విషయంలో ఇలానే జరిగింది. మరిప్పుడు ‘ఆచార్య’ను కూడా మూడు వారాల కంటే ముందే ఓటీటీలో రిలీజ్ చేస్తారేమో చూడాలి.

Chiranjeevi and Ram Charan's Acharya to arrive on THIS OTT platform?

ఈ సినిమా కాకుండా.. ప్రస్తుతం మెగాస్టార్ గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరోవైపు చరణ్… డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *