తనలో మరో యాంగిల్ ను బయట పెట్టిన చిరంజీవి!

Chiranjeevi: టాలీవుడ్ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈయనకు విపరీతమైన అభిమానుల సంఖ్య ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం కుర్ర హీరోలతో పోటీగా దూసుకెళ్తున్నాడు. ఇక ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.

ఇదిలా ఉంటే మెగాస్టార్ ప్రస్తుతం కరోనా సోకడంతో క్వారంటైన్ లో ఉన్నాడు. ఇక ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అలా సోషల్ మీడియాలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. దీంతో తాజాగా తనలోని ఫోటోగ్రఫీ స్కిల్స్ ను బయటకి తీశాడు. ఇంట్లో ఉంటూనే ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తున్నాడు చిరు.

“ఈరోజు ఉదయం లేవగానే కనిపించిన ఆకాశాన్ని బంధించి మీతో పంచుకోవాలనిపించింది. ఒక మూలన ఉన్న చందమామ మధ్యలో ఉన్న నక్షత్రం, ఉదయించబోతున్న సూర్యుడు. ఆ కొంటె సూర్యుడిని చూడలేక చందమామ సిగ్గుతో ప్రక్కకు వెళ్లిపోయినట్లు గా ఉంది” అని చిరంజీవి దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు.

 

ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైనా స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. ” నైస్ ఫోటోగ్రఫీ చిరంజీవి సార్” అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా “రైటర్ పీస్ కూడా బాస్ మీరు గెట్ వెల్ సూన్” అంటూ మరో నెటిజన్ కామెంట్ చేసాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *