అది నాది కాదు అంటూ నెటిజన్లకు షాకిచ్చిన అనుపమ!

Anupama Parameswaran: టాలీవుడ్ ప్రేక్షకులకు అనుపమ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ‘అఆ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకొని అభిమానులుగా చేసుకుంది. ఆపై పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Anupama Parameswaran
Anupama Parameswaran

ఇక ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో తాను ఓ వెలుగు వెలుగుతుంది. ఈ ముద్దుగుమ్మకు మంచి ఫేమ్ సంపాదించి పెట్టిన సినిమాలలో ‘శతమానం భవతి’ ఒకటి. ఇక అనుపమ సోషల్ మీడియాలో కూడా బాగా హడావిడి చేస్తుంది. ఎప్పటికప్పుడు తన అందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటుంది.

ఇదే క్రమంలో అనుపమ తన ఇన్ స్టా స్టోరీ లో ఒక నెంబర్ మెన్షన్ చేసింది. అంతేకాకుండా ఈ నెంబర్ నాది కాదు. అందరూ జాగ్రత్తగా ఉండండి అని తెలిపింది. ఈ స్టోరీ చూసిన నెటిజన్లు తెగ ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. ఇక అనుపమ తన ఇన్ స్టా లో కడుపుతో ఉన్నట్టుగా ఓ పోస్ట్ షేర్ చేసింది.

ఈ పోస్ట్ చుసిన నెటిజన్లకు ఏమి అర్థం కాక తమదైన స్టైల్లో కామెంట్స్ పెడుతున్నారు. ఇక వాటికి అనుపమ సమాధానం కూడా చెబుతుంది. ఇటీవలే అనుపమ రౌడీ బాయ్స్ సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *