విడాకులు తీసుకున్న స్టార్‌ డైరెక్టర్‌

ఇండస్ట్రీలో కొన్నాళ్లుగా విడాకుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్ప‌టికే అమీర్‌ఖాన్‌-కిర‌ణ్‌రావు, స‌మంత‌- నాగ‌చైత‌న్య‌, ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య స‌హా ప‌లువురు స్టార్స్‌ విడాకులు తీసుకున్నారు. అనంతరం కొన్ని రోజుల వ్యవధిలో సంగీత దర్శకుడు డి. ఇమాన్, మోనికా సైతం విడాకులు తీసుకున్నారు. హిందీ పరిశ్రమలోనూ విడాకులు తీసుకున్న జంటలు ఉన్నాయి. అయితే.. తమిళ ఇండస్ట్రీలో ఈ విడాకులు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. తాజాగా మ‌రో స్టార్ క‌పుల్ సైతం విడాకులు తీసుకుంది. త‌న భార్య నుంచి విడాకులు తీసుకున్న‌ట్లుగా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు బాలా ప్ర‌క‌టించాడు.  తమిళ చిత్ర పరిశ్రమలో ఈ వార్త సంచలనంగా మారింది. 

Director bala and muthumalar get divorced

తమిళ స్టార్ డైరెక్టర్ బాలా… తన భార్య మధుమలార్‏తో విడాకులు తీసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.  18 ఏళ్ల వైవాహిక బంధానికి వీరిద్దరు ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. గత నాలుగేళ్లుగా బాల.. మధుమలార్ విడి విడిగా ఉంటున్నారు. విడాకులకు అప్లై చేసిన ఈ జంటకు తాజాగా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. వీరికి ఒక కూతురు ఉంది. బాలా తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ ఫేమస్.

ఈయన దర్శకత్వంలో తమిళ్ స్టార్ విక్రమ్ నటించిన సేతు సినిమా సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో శివపుత్రుడు పేరుతో డబ్ అయిన ఈ మూవీ మంచి టాక్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఆర్య సినిమా నేనే దేవుణ్ణి, వాడు..వీడు.. చిత్రాలు తెలుగులో మంచి ఆదరణను దక్కించుకున్నాయి. అలాగే 2008లో బాల ‘నాన్ కాదవుల్’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఇదిలా ఉండగా బాల తదుపరి చిత్రం హీరో సూర్యతో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *