కొత్త రికార్డులు క్రియేట్‌ చేసిన విజయ్‌ ‘బీస్ట్’ సాంగ్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘బీస్ట్‌’. ‘డాక్ట‌ర్’ ఫేం నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 13న బీస్ట్‌ విడుదల కానుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, పాటలు సినిమాపై భారీ అంచ‌నాల‌ను నమోదు చేశాయి.

Vijay beast movie arabic kuthu song creates new records

అయితే, ఈ సినిమా నుంచి కొన్ని రోజుల క్రితం ‘అరబిక్ కుతూ’ సాంగ్ ను రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఈ పాట వ్యూస్ పరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తూ వెళుతోంది. ఇప్ప‌టికే ఈ పాట రీల్స్‌లో మారు మోగిపోయింది. ప‌లువురు సినీప్ర‌ముఖులు కూడా ఈ పాట హూక్ స్టెప్స్‌ను వేశారు. తాజాగా ఈ పాట 250 మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసింది. ఈ తరహాలో పాటను డిజైన్ చేయడానికి మిగతా వాళ్లంతా కసరత్తు చేసేలా ఈ పాట ప్రభావితం చేసింది. ఈ పాట‌కు శివ‌కార్తికేయ‌న్ సాహిత్యం అందించ‌గా, అనిరుధ్ ఆల‌పించాడు.

https://twitter.com/sunpictures/status/1509819637990838272?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1509819637990838272%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fcinema%2Farabic-kuthu-song-received-250-million-views-in-youtube-522425

పాన్ ఇండియా లెవ‌ల్లో తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 13న ఐదు భాష‌ల్లో విడుద‌ల‌కానుంది. విజయ్ చివరగా నటించిన మాస్టర్, బిగిల్ సినిమాలు ఘన విజయాలు అందుకోవడంతో.. బీస్ట్‌ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బీస్ట్‌ సినిమాలో విజయ్.. వీర రాఘవ పాత్రలో రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు.  యాక్ష‌న్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్ 2న సాయంత్రం 6 గంటలకు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *