రొమాంటిక్‌ ఫోటోతో పెళ్లి కబురు చెప్పిన రాహుల్..!

సైన్మా షార్ట్ ఫిల్మ్‌తో తొలిసారి కెమెరా ముందుకొచ్చాడు హైద‌రాబాదీ యాక్ట‌ర్ రాహుల్ రామ‌కృష్ణ. మీడియా రంగం నుంచి సినిమా రంగానికి ఎంట్రీ ఇచ్చిన ఈ క్రేజీ న‌టుడు అర్జున్ రెడ్డి సినిమాలో పోషించిన శివ పాత్ర‌తో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. చిన్న చిన్న పాత్ర‌లు చేసుకుంటూ..త‌క్కువ టైంలోనే ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా ప్రాజెక్టులో న‌టించే అరుదైన అవ‌కాశం కొట్టేశాడు. కామెడీ రోల్స్‌తో పాటు ప‌ర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్ర‌లు చేస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇలా వరుస సినిమాలతో మంచి ఫామ్‌లో ఉన్న రాహుల్‌ తాజాగా ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పారు.

Actor Rahul Ramakrishna announces his marriage with romantic pic

త్వరలో తాను పెళ్లి చేసుకోనున్నట్లు రాహుల్‌ రామకృష్ణ తెలిపారు. తన జీవితభాగస్వామిని పరిచయం చేస్తూ ఆదివారం ట్విటర్‌ వేదికగా ఓ ఫొటో షేర్‌ చేశారు. ‘‘ఎట్టకేలకు, త్వరలో పెళ్లి చేసుకోనున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. అయితే తన జీవిత భాగస్వామికి సంబంధించిన ఎలాంటి వివరాలను ఆయన వెల్లడించలేదు. ఇక, ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ కంగ్రాట్స్‌ చెబుతున్నారు.  నిజానికి, మూడు రోజుల క్రితమే ఇన్‌స్టాగ్రామ్‌లో కాబోయే భార్యకు లిప్ కిస్ ఇస్తున్న ఫొటో షేర్ చేశారు రాహుల్ రామకృష్ణ. ‘మీట్ హర్’ అంటూ ఆమెను పరిచయం చేశారు. రియల్ లైఫ్ ఫొటోనా? రీల్ లైఫ్ (సినిమా / వెబ్ సిరీస్) ఫొటోనా? అని కొంత మంది క‌న్‌ఫ్యూజ్‌ అయ్యారు. అయితే.. ట్విట్టర్‌ ద్వారా ఈ రోజు క్లారిటీ వచ్చింది.

ప్రస్తుతం రాహుల్‌ షేర్‌ చేసిన ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. అసలైన జాతిరత్నానివి నువ్వు.. అర్జున్‌ రెడ్డి స్టైల్‌లో చెప్పినవ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇప్పటివరకూ డజనుకు పైగా చిత్రాల్లో నటించిన రాహుల్ రామకృష్ణకు అర్జున్ రెడ్డితో పాటు గీత గోవిందం, హుషారు,ఆర్‌ఆర్‌ఆర్‌ తదితర చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. రాహుల్ నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’, ‘విరాటపర్వం’ సినిమాలు ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *