‘డెలివరీ తర్వాత గ్లామరస్‌గా ఉండదు’..తల్లయ్యాక కాజల్‌ ఫస్ట్‌ పోస్ట్‌

టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. మంగళవారం నాడు ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు నీల్ కిచ్లూ అనే పేరు పెడుతున్నట్టు కాజల్ సోదరి నిశా అగర్వాల్ నిన్న తెలిపింది. కాగా తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ. కుమారుడిని స్వాగతిస్తూ… కాజల్ అగర్వాల్ తాజాగా ఒక భావోద్వేగభరిత లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Kajal Aggarwal's First Post After Birth Of Son
kajal Agarwal

‘నా బిడ్డ నీల్‌ను ప్రపంచంలోకి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. ఎంతో సంతోషిస్తున్నాను. నీల్‌ మొదటిసారి నా ఛాతిపై పడుకొన్నప్పటి క్షణం నాజీవితంలో ఎప్పటికీ మరచిపోలేనిది. ఆ ఒక్క క్షణం నేను ప్రేమకు సంబంధించిన లోతైన భావన పొందాను. జీవితాంతం నేను పూర్తి చేయాల్సిన బాధ్యతను గుర్తుచేసుకున్నాను. నిజానికి ఒక బిడ్డకు జన్మనివ్వడం అంత సులభమైన విషయం కాదు. నేను మూడు రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను. ఎప్పుడెప్పుడు నా బిడ్డను ఎత్తుకుందామా అన్న ఆతృతను ఆనందంగా అనుభవించాను’ అని పేర్కొన్నారు.

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు కానీ… అందంగా మాత్రం ఉంటారని చెబుతూ తన మాతృత్వపు ముధురానుభూతుల్ని పంచుకుంది కాజల్‌.  ఇక కాజల్‌ ప్రెగ్నెంట్‌ అని ప్రకటించినప్పటి నుంచి ఆమె సంబంధించిన ప్రతి అప్‌టేడ్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూనే ఉంది. బేబీ బంప్‌ ఫోటోలు, తన వర్కవుట్‌లు అన్నింటినీ అభిమానులతో పంచుకుంది. కాగా ప్రెగ్నెంట్‌   అయినప్పటి నుంచి కాజల్ సినిమాలకు కొంచెం దూరంగానే ఉన్నారు. అయినప్పటికీ బేబీ బంప్‌తోనే ఒక యాడ్‌లో నటించి ఆశ్చర్యపరిచారు కాజల్.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *