ఎక్స్‌ట్రాడినరీ ఫ‌న్‌తో ‘ఎఫ్ 3’ ట్రైలర్.. చూశారా..!

టాలీవుడ్‌ అగ్ర క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టిస్తోన్న లేటెస్ట్ ఫ‌న్ రైడ‌ర్ F3 . అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్‌-2కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం ఈసారి డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.  శ్రీ వెంకటేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటించారు.  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్‌, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్‌ తాజాగా ఎఫ్‌-3 ట్రైలర్‌ను విడుదల చేశారు.

F3 movie trailer out

‘‘ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు అయిదే. కానీ ఆరో భూతం ఒకటి ఉంది. అదే డబ్బు’’ అంటూ మురళీశర్మ చెప్పే డైలాగ్‌లతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగింది. ఓ వైపు రేచీకటి వ్యక్తిగా వెంకీ.. నత్తి ఉన్న వ్యక్తిగా వరుణ్‌ ఇచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్‌ పీక్స్‌లో ఉంది. ఇక, డబ్బు కోసం వాళ్లు పడే పాట్లు, తమన్నా, మెహ్రీన్‌ అండ్‌ ఫ్యామిలీ చేసే పనులు.. దానికి మన హీరోలు ఇచ్చే రియాక్షన్ ఈలలు వేయించేలా ఉన్నాయి. ట్రైలర్‌ చివర్లో ‘అంతేగా అంతేగా’ డైలాగ్‌ మరింత నవ్వులు పూయించేలా ఉంది. డబ్బు చుట్టూ కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే మరోసారి కన్ఫర్మ్ అయ్యింది. ఇక వేసవిలో సినిమా మాంచి ఫన్ అందించేలా ఉంది.

‘ఎఫ్ 3’ నుంచి ఆల్రెడీ రెండు సాంగ్స్ విడుదల చేశారు. ‘లబ్ డబ్…’, ‘ఊ ఆ ఆహా ఆహా’ సాంగ్స్ మంచి వ్యూస్ అందుకుంటున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న చిత్రమిది. సోనాల్ చౌహన్ ప్రత్యేక పాత్రలో, పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో నటించారు. ఇందులో సునీల్, ప్రగతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *