బన్నీ గురించి కొన్ని నిజాలు బయట పెట్టిన హార్మన్ కౌర్!

Harmon kaur and Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ‘గంగోత్రి’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ నటుడు.. ఆపై పలు సినిమాలలో నటించి తన యూనిక్ స్టైల్ తో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాతో ఓ వెలుగు వెలుగుతున్నాడు.

Harmon kaur and Allu Arjun
Harmon kaur and Allu Arjun

ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చిత్తూరు యాసతో డిఫరెంట్ స్టైల్ తో ప్రేక్షకులను మరింత ఫిదా చేసాడు. ఇదిలా ఉంటే బన్నీ పర్సనల్ స్టైలిస్ట్ హార్మన్ కౌర్ ఓ ఇంటర్వ్యూ లో బన్నీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది.

బన్నీ ప్రతి సినిమాలో కొత్తగా కనిపించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాడు అని రియల్ లైఫ్ లో క్యారెక్టర్స్ కు కాకుండా స్క్రీన్ మీద నటులకు కొత్తగా కనిపించాలని బన్నీ ఆలోచిస్తాడు అని తెలిపింది. ఇక గత కొన్ని సంవత్సరాలుగా బన్నీ ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా స్టైల్ గా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా జుట్టు, గడ్డం తో ఫ్యాన్స్ ను మరింత ఫిదా చేస్తున్నాడు అని హార్మన్ కౌర్ తెలిపింది.

ఈ క్రమంలో తాను బన్నీ దగ్గర చాలా నేర్చుకున్నాను అని ఏ పాత్ర పోషించినా దాని మీద సరిగ్గా దృష్టి పెట్టి కష్టపడతాడు. ఆ కష్టం మొత్తం కూడా అతని పాత్రలో కనిపిస్తూనే ఉంటుంది. నేను అల్లు అర్జున్ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్న అని హార్మన్ కౌర్ తెలిపింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *