బ్రహ్మానందం గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు!

Nagababu: టాలీవుడ్ ప్రేక్షకులకు కమెడియన్ కింగ్ బ్రహ్మానందం గురించి ఎంత చెప్పిన తక్కువే. వెయ్యికి పైగా సినిమాలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. అగ్ర హాస్య నటుడుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా 2010లో గిన్నీస్ రికార్డు కూడా తన సొంతం చేసుకున్నాడు.

Nagababu
Nagababu

వెండితెరపై బ్రహ్మీ అని పేరు వినబడితే చాలు ప్రేక్షకులు ఈలలు వేసి గోల చేస్తారు. ఇదిలా ఉంటే అలాంటి కామెడీ కింగ్ పై మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల దావత్ అనే ప్రోగ్రాంలో బ్రహ్మానందం స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఇక వేదికపై తన మాటలతో తన హావభావాలతో లైవ్ పర్ఫామెన్స్ చేసి కడుపుబ్బ నవ్వించారు.

ఆ సమయంలో బ్రహ్మానందాన్ని అలా చూసిన నాగబాబు తన మనసులోని మాటలను ఒకదాని తర్వాత మరొకటి బయటపెట్టాడు. బ్రహ్మానందాన్ని తెగ పొగిడేశారు. ‘రేలంగి తరువాత బ్రహ్మానందం అనేవాడు తెలుగు ఇండస్ట్రీకి రాకుంటే.. ఈ పాటికి తెలుగు సినిమా అనేది ఉప్పులేనికూరలా ఉండేది. ఉప్పు లాగా ఎంటర్ అయ్యాడయా మహానుభావుడు’ అంటూ బ్రహ్మీని తెగ పొగిడేస్తూ కామెంట్స్ చేశారు నాగబాబు.

కొంతకాలంగా బ్రహ్మానందం నుంచి చాలా క్యారెక్టర్స్ మిస్ అయ్యమని లక్కీగా మీమర్స్ బ్రహ్మీని వదలకుండా మీమ్స్ రూపం లో ప్రతిరోజూ చూపిస్తున్నారని నాగబాబు అన్నారు. ప్రత్యేకంగా బ్రహ్మానందం దానధర్మాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన కామెడీ చూసి నవ్విన ప్రతి వాడి పుణ్యం అతనికి దక్కేస్తుందని నాగబాబు అన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *