విడాకులు గురించి తొలిసారిగా స్పందించిన సంజన గల్రాని..

టాలీవుడ్ నటి సంజన గల్రాని గురించి అందరికీ పరిచయమే. మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ వెండితెరపై కూడా పరిచయమై తానేమిటో నిరూపించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటించింది. ఇక ఈమె నటిగా కంటే వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది. తొలిసారిగా సోగ్గాడే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాగా.. ఆ తర్వాత ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.

అలా పలు సినిమాలలో కూడా నటించింది. ఇక సంజన 2020లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత తనకు అనారోగ్య సమస్య ఉండటం వల్ల బెయిల్ ద్వారా కొన్ని షరతులతో బయటికి వచ్చింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ ఎవరికి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. తమ పెళ్లి ఫోటోలు తానే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త, డాక్టర్ పాషా అనే తన చిన్ననాటి స్నేహితుడుని ప్రేమించి అతి తక్కువ మంది సమక్షంలో పెళ్లి చేసుకుంది.

ఇక పెళ్ళి తరువాత ఆరు నెలలకే ఈ అమ్మడు విడిపోతుందని తెగ వార్తలు వినిపించాయి. అయినా కూడా ఈ విషయం గురించి ఆ సమయంలో స్పందించలేదు సంజన.ఆ తర్వాత కొంత కాలానికి ఆమె గర్భవతి అని వార్తలు వినిపించాయి. ఈ విషయం గురించి కూడా స్పందించలేదు. ఇక ఇటీవలే సంజన తన భర్తతో విడిపోతుందని.. త్వరలో తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందని తెగ వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈసారి ఈ విషయం గురించి స్పందించింది.

తమ వైవాహిక జీవితం చాలా బాగుందని.. తన పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని. ఆధారాలు లేని వార్తలను సృష్టించవద్దని. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని గట్టిగా హెచ్చరించింది. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ తన భర్తతో కలిసి ఉంటుందని క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ సినిమాలో బిజీగా ఉంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *