విడాకులు, అవమానం, మరణం అంటూ సమంత పోస్ట్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది. విడాకుల అనంతరం సినిమాలతో పాటు అటు టూర్‌లను బాగా ఎంజాయ్‌ చేస్తుంది. విమ‌ర్శ‌ల నుండి దూరంగా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే సోష‌ల్ మీడియా లో మాత్రం స‌మంత అప్పుడూ ఇప్పుడూ ఎప్పూడూ యాక్టివ్‌గానే ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సామ్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

samantha shares will smiths quote on humiliation divorce money and family

ప్రముఖ హాలీవుడ్ హాస్యనటుడు విల్ స్మిత్. .. విల్ పుస్తకం నుంచి ఓ కోట్ షేర్ చేసింది సమంత. అందులో.. ” గత ముప్పై సంవత్సరాలుగా.. మనందరిలాగే.. ఒకటి. వైఫల్యం, నష్టం, అవమానం, విడాకులు, మరణంతో వ్యవహరించాము. నాకు ప్రాణహాని ఉంది. నా డబ్బు లాక్ చేయబడింది. నా వ్యక్తిగత విషయాలను అతిక్రమించారు. నా కుటుంబం విచ్ఛిన్నమైంది. ప్రతిరోజూ కాంక్రీట్ కలిపి.. ఇటుకను పేర్చాలి. మీరు ఏదారిలో వెళ్తున్నారో తెలియదు..కానీ అక్కడ ఎల్లప్పుడూ ఒక ఇటుక మీ ముందు ఉంటుంది.. అది కూడా పేర్చేందుకే ఉంది.. కానీ నువ్వు ఆ ఇటను పేరుస్తున్నావా ? ” అని ఉంది. ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

samantha shares will smiths quote on humiliation divorce money and family

అలాగే సమంత విల్ పుస్తకాన్ని షేర్ చేస్తూ.. కష్టపడి పని చేయండి. మీకు తగిలిన ఎదురుదెబ్బల నుంచి నేర్చుకోండి.. మిమ్మల్ని మీరు చూసుకోండి. మిమ్మల్ని మీరు ప్రతి రోజూ ఆవిష్కరించుకోండి. అలాగే మిమ్మల్ని మీరు ఎప్పటికీ కోల్పోవద్దు.. విల్ పుస్తకం అద్భుతమైనది అంటూ క్యాప్షన్ ఇచ్చింది సమంత. ప్రస్తుతం సామ్ శాకుంతలంసినిమా చేస్తుంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *