విజయ్ దేవరకొండ బర్త్‌ డే.. సర్‌ప్రైజ్‌ అద్దిరిపోయింది

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పూరి-విజయ్‌ కాంబినేష్‌లో ‘లైగర్‌’ సినిమా అని ప్రకటించగానే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల చేయనున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్  వదలగా.. యూట్యూబ్‌లో సెన్సేషన్ అయింది. ఇక ఈరోజు (మే 9) విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ‘లైగర్ హంట్’ అనే సాంగ్ థీమ్‌ను రిలీజ్ చేశారు.

Vijay Deverakonda’s birthday treat for fans

‘బతకాలంటే గెలవాల్సిందే’ అంటూ సాగే ఈ థీమ్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ అయితే ఓ రేంజ్ లో ఉంది. విక్రమ్ మాన్ట్రోస్ ఈ సాంగ్ ను కంపోజ్ చేయగా.. భాస్కర్ భట్ల లిరిక్స్ అందించారు. తెలుగు వెర్షన్ ను హేమచంద్రతో పాడించారు. సాంగ్ విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. విజయ్ చాలా అగ్రెసివ్ గా కనిపించాడు. ఆపోజిట్ ప్లేయర్‌కి మిడిల్ ఫింగర్ చూపిస్తూ కనిపించాడు. మెుత్తానికి ఈ పవర్‌ఫుల్‌ గీతం అన్ని వర్గాల వారిని అలరించేలా ఉంది.

మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా కోసం విజయ్‌ తన శరీరాకృతిని మార్చుకున్న సంగతి తెలిసిందే. సిక్స్‌ప్యాక్‌ బాడీతోపాటు పొడవాటి జుత్తుతో సరికొత్తగా కనిపించాడు. ఈ సినిమాలో విజయ్‌ సరసన అనన్య పాండే సందడి చేసింది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ను కీలక పాత్ర కోసం తీసుకున్నారు.  రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ  సినిమా విడుదల తేదీ ఆగస్టు 25 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *