రాజమండ్రి కి మళ్ళీ పయనమైనా చరణ్!

Ram Charan: టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘చిరుత’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘మగధీర’ తో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు చరణ్. ఇక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల తాను ఒకడిగా వెలుగుతున్నాడు.

Ram Charan
Ram Charan

అంతేకాకుండా రాబోయే త్రిబుల్ ఆర్ మూవీ తో చరణ్ పాన్ ఇండియా స్థాయిలో ఫామ్ తెచ్చుకోబోతున్నాడు. ఇదిలా ఉంటే చరణ్ మరోసారి సినిమా షూటింగ్ పేరుతో రాజమండ్రి వెళుతున్నట్లు తెలుస్తుంది. గతంలో రంగస్థలం సినిమా కోసం రామ్ చరణ్ సూట్ కొంత వరకు అక్కడే జరిగింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న Rc 15 మూవీ షూట్ కూడా కొంత వరకు అక్కడే జరుగుతుంది అని తెలుస్తుంది.

ఈ సినిమాకు కావలసిన కొన్ని లొకేషన్లు రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్ లు, ఫైట్స్ సీక్వెన్స్ గా రూపొందించబోతున్నారు అని తెలుస్తుంది. ఇక ఈ రాజమండ్రి షెడ్యూల్లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ లేనట్లు తెలుస్తుంది. శ్రీకాంత్, చరణ్ మరి కొంతమంది యాక్టర్స్ మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక దాదాపు ఫిబ్రవరి నెల మొత్తం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలోనే సరిపోతుందని తెలుస్తుంది. కాగా ఈ షెడ్యూల్ ను ఫిబ్రవరి 10న స్టార్ట్ చేసి అదే నెల 28వరకు షెడ్యూల్ అక్కడే కొనసాగుతుంది అని తెలుస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *