కోలీవుడ్ ప్లే బాయ్ తో నిధి అగర్వాల్ రొమాన్స్.. ఇక ఆమె పరిస్థితి కూడా అంతేనా?

టాలీవుడ్ నటి ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. తన అందంతో కుర్రాళ్లను బాగా ఫిదా చేసింది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో తనేంటో నిరూపించుకుంటుంది. తొలిసారిగా బాలీవుడ్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

తెలుగు సినీ ఇండస్ట్రీకి సవ్యసాచి సినిమాతో పరిచయం కాగా ఎందుకో అంత సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాలో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఖాతాలో వరుస సినిమాలు ఉన్నాయి.

ఇదంతా పక్కన పెడితే.. ఈ బ్యూటీ కోలీవుడ్ ప్లే బాయ్ తో లవ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇంతకీ అతడు ఎవరో కాదు శిలంబరసన్. అదేనండోయ్ నయనతార, హన్సికతో ప్రేమాయణం నడిపి వాళ్లను వదిలేసిన శింబునే ఇప్పుడు ఇస్మార్ట్ బ్యూటీతో రొమాన్స్ చేస్తున్నట్లు తెలిసింది.

త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదండోయ్ ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే శింబు ఈ బ్యూటీని పెళ్లి చేసుకుంటాడో లేదా ఆ హీరోయిలను వదిలేసినట్టు ఈమెను కూడా అలాగే వదిలేస్తాడామో అని అనుమానాలు వస్తున్నాయి. మరి వీరి రిలేషన్ ఎంతవరకు కొనసాగుతుందో.. అసలు వీరి మధ్య ఉన్నది నిజమైన ప్రేమనో లేదో అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నిధి పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో బిజీగా ఉంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *