సైనా నెహ్వాల్ పై సెటైర్లు వేసిన హీరో సిద్దార్థ్.. ఏకంగా ఆ పదాలను వాడుతూ!

టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో సిద్దార్థ్ గురించి పరిచయం అవసరం లేదు. అతడు నటుడుగా, నిర్మాతగా, సింగర్ గా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘బాయ్స్’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఆ తర్వాత ‘నువ్వు వస్తానంటే నేనొద్దంటానా’ చిత్రం తో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాడు.

Siddharth And Saina Nehwal
Siddharth And Saina Nehwal

ఈ మధ్యే వచ్చిన మహా సముద్రంతో ప్రేక్షకులకు తనను తాను కొత్తగా మరో సారి పరిచయం చేసుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఈ హీరో తాజాగా బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై ఓ బోల్డ్ సెటైర్ వేశాడు. అది ఎలా అంటే.. పంజాబ్ లో ప్రధాని మోడీకి భద్రతకు కలిగిన భంగం గురించి మనకు తెలిసిందే. దీనిపై సైనా నెహ్వాల్ స్పందించింది.

ప్రధానికే రక్షణ లేనప్పుడు దేశంలో నార్మల్ పీపుల్స్ కు రక్షణ ఎలా ఉంటుందని పంజాబ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సైనా నిహాల్ ట్విట్టర్ ఖాతా వేదికగా ట్వీట్ చేసారు. దీనిపై సిద్ధార్థ స్పందించిన తీరు ఇబ్బందికరంగానే ఉందని చెప్పొచ్చు. సైనా నెహ్వాల్ ను విమర్శించేందుకు కొంచెం అసభ్యకర పదాలు వాడారు. రెండు అర్థాలు వచ్చేలా ఆ ఇంగ్లీష్ వర్డ్ ని యూస్ చేసి కవర్ చేసుకునేందుకు ప్రయత్నం చేశాడు.

కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్ అంటూ సైనా మీద సెటైర్లు వేశాడు. ఇండియాలో ప్రొజెక్టర్లు ఉన్నారంటూ కౌంటర్లు కూడా వదిలాడు. ఇందులో వాడిన కాక్ అనే పదాన్ని అందరూ తమకు నచ్చలేదు అన్నట్టుగా తెలిపారు. ఫిమేల్ సింగర్ చిన్మయి కూడా దీని పై స్పందిస్తూ తప్పు అని ఖండించింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *