రెండో పెళ్లికి సిద్ధమైన హృతిక్‌ రోషన్‌?

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు హృతిక్‌ రోషన్ మళ్లీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. 2014లో పరస్పర అంగీకారంతో భార్య సుస్స‌న్నే ఖాన్ నుంచి విడాకులు తీసుకున్నాడు హృతిక్. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ నటి సబా ఆజాద్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. దీంతో వీరు కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. గత కొన్నిరోజులుగా ముంబయిలోని ప్రముఖ రెస్టారెంట్లకు డిన్నర్‌ డేట్స్‌కు వెళ్తున్నారు. దీంతో ఈ జంట ఇటీవల కెమెరా కంట పడటంతో వీళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది.

Hrithik roshan getting ready for second marriage

కాగా, తాజా సమాచారం ప్రకారం హృతిక్‌ – సబా త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హృతిక్‌ రోషన్‌.. తన కుటుంబ సభ్యులు, పిల్లలకు సబా ఆజాద్‌ని పరిచయం చేయగా.. వాళ్లందరికీ ఆమె బాగా నచ్చిందట. మాజీ సతీమణి సుస్సన్నేఖాన్‌ కూడా సబాతో సన్నిహితంగా ఉంటోందట. సమయం దొరికినప్పుడల్లా సబా.. హృతిక్‌ ఇంట్లో వాలుతుందోని బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. హృతిక్‌ కుటుంబంతో సబా కలిసి ఉన్న పలు ఫొటోలు సైతం ఇటీవల బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు వైరల్‌గా మారాయి. త్వర‌లోనే వీళ్ల పెళ్ళి గురించి అధికారికంగా ప్ర‌క‌ట‌న రానుందంటూ బాలీవుడ్ వ‌ర్గాల నుంచి స‌మాచారం.

Hrithik roshan getting ready for second marriage

ప్ర‌స్తుతం హృతిక్‌ విక్ర‌మ్ వేద సినిమాలో న‌టిస్తున్నాడు. తమిళంలో సూప‌ర్ హ‌ట్ట‌యిన విక్రమ్ వేద చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. సైఫ్ అలీఖాన్ మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. ఇంకా ‘ఫైటర్’, షారుఖ్ ఖాన్ ప‌ఠాన్ సినిమాలో , స‌ల్మాన్ ఖాన్ టైగ‌ర్‌-3 సినిమాలో గెస్ట్ రోల్‌లో న‌టించ‌నున్నాడు హృతిక్‌.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *