పగిలిన గాజు ముక్కలతో డ్రస్‌ వేసుకుని పిచ్చెకిస్తున్న బాలీవుడ్ బ్యూటీ..!

పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ OTT హిందీ సీజన్ 1లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసి తన పాపులారిటీని ఇంకా పెంచేసుకుంది బ్యూటిఫుల్ భామ ఉర్ఫీ జావెద్. పలు టెలివిజన్ సీరియల్స్ లో నటించిన ఈ భామ..‘బిగ్ బాస్’తో ప్రేక్షకులకు ఇంకా దగ్గరైంది. చిత్ర విచిత్రమైన డ్రెస్టింగ్‌ స్టైల్స్‌తో సోషల్‌ మీడియాలో అంతకన్నా ఎక్కువ పాపులర్‌ అయింది. డ్రెస్సింగ్ స్టైల్స్‌లో కొత్త కొత్త వెరైటీలను ట్రై చేస్తూ కొన్నిసార్లు ప్రశంసలు పొందితే, మరికొన్ని సార్లు తీవ్ర విమర్శల పాలైంది ఈ బ్యూటీ. ఇంతకుముందు మెర్మేయిడ్‌ స్పాట్‌డ్‌ వేర్‌లో కనిపించిన ఉర్ఫీ జావేద్‌ మరోసారి సరికొత్త డ్రెస్‌లో దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

Urfi Javed dancing Video in Broken Glass going Viral On Social Media

అందులో ఉర్ఫీ జావేద్.. పగిలిన గాజు ముక్కలతో తయారు చేసిన డ్రెస్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ వీడియోను షేర్ చేస్తూ.. ” అవును.. నేను పగిలిన గాజు ముక్కలతో చేసిన డ్రెస్ ధరించాను.. ఇది అద్భుతంగా అనిపించిందని నేను అనుకుంటున్నాను.. కానీ ప్రజలు నన్ను పిచ్చి, వింత అంటూ పిలుస్తారు..కానీ మనమందరం వెర్రి, విచిత్రమైన సమాజంలోనే ఉన్నామని గ్రహించండి..నేను కేవలం నన్ను నేను చూసుకోవడానికి నాకు తెలివి, శక్తి ఉన్నాయి.” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఇక ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఉర్ఫీ పోస్ట్ చేసిన వీడియోకు నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఉర్పీ అసలు లెక్క చేయడం లేదు. మొత్తానికి ఉర్ఫీ మాత్రం తన వెరైటీ డ్రెస్సింగ్ స్టైల్ తో సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *