అతని రాకతో నాకు ధైర్యం వచ్చింది: జాన్వీ కపూర్

అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్​ తనదైన నటనతో బాలీవుడ్​లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ధడక్’ సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చి ప్రశంసలు దక్కించుకుంది. నటనతోనే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటూ అభిమానులకు టచ్​లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఫిల్మ్‌ఫేర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో తన తోబుట్టువులు అర్జున్ కపూర్, అన్షులా కపూర్‌ గురించి చెప్పుకొచ్చింది.

Janhvi Kapoor on her relationship with Arjun, Anshula

సోషల్‌మీడియాలో భిన్నమైన మనుషులు ఉంటారని… ఒక్కొక్కసారి ఒక్కొలా స్పందిస్తూ.. వాళ్లు పెట్టే కామెంట్లు చూసి కొన్నిసార్లు ఆశ్చర్యపోతుంటానని జాన్వి తెలిపింది. ‘‘అమ్మ మరణించిన తర్వాత అర్జున్‌ అన్నయ్య, అన్షులా మా జీవితాల్లోకి వచ్చారు. వాళ్ల రాకతో మేం మరింత ధైర్యవంతులమయ్యామనే భావన కలిగింది. ఖుషీకి నాకూ మరో ఇద్దరు తోబుట్టువులు దొరికారు. ఇందుకు మేము ఎంతో అదృష్టవంతులం. మేము నలుగురం కలిసి ఉన్నందుకు నాన్న కూడా ఎంతో ఆనందిస్తున్నారు. ఆయన మాతో ఒక ఫ్రెండ్‌లానే ఉంటారు’’ అని జాన్వి వివరించారు.

Janhvi Kapoor on her relationship with Arjun, Anshula

అర్జున్‌ కపూర్‌, అన్షులా కపూర్‌ ఇద్దరు బోనీ కపూర్‌ మొదటి భార్య మోనా శౌరీకు పుట్టిన పిల్లలనే విషయం తెలిసిందే. ఇక జాన్వీ త్వరలోనే టాలీవుడ్‌ ప్రవేశం చేయనున్నారని టాక్‌ వినిపిస్తోంది. మరి ఆ రూమర్‌ ఎంత వరకు నిజమో తెలియాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *