దారుణంగా పడిపోయిన ‘ఢీ’.. కారణం సుధీర్, రష్మీలేనా!

బుల్లితెరపై ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోలు ప్రసారమవుతున్నాయి. కంటెస్టెంట్ ల పర్ఫామెన్స్ లతో
ప్రేక్షకులను తమవైపు లాక్కొని మంచి రేటింగ్ ను సంపాదించుకుంటున్నారు పలు నిర్మాణ సంస్థలు. మరో షో తో పోటీగా నిలుస్తూ తమ షోలతో మరింత రచ్చ చేస్తున్నారు ఆర్టిస్టులు. కొన్ని కొన్ని సార్లు వేదికపై కౌంటర్లు, రొమాన్స్ లు చేస్తూ మరింత ఆకట్టుకుంటారు.

అలా ఈటీవీలో ప్రసారమవుతున్న ‘ఢీ’ డాన్స్ షో కూడా అలాగే రేటింగ్ ను పెంచుకుంది. అది కూడా సుధీర్, రష్మీలు ఉన్నపుడే. కానీ ఇప్పుడు ఆ రేటింగ్ అస్సలు అందుకోలేకపోతుంది ఢీ షో. ఇటీవలే సీజన్ 13 పూర్తికాగా ఢీ 14 ది డాన్సింగ్ ఐకాన్ అనే పేరుతో సరికొత్తగా ప్రసారమయింది.

ఇక ఇందులో ఈసారి సుడిగాలి సుధీర్, రష్మీ, పూర్ణకు బదులుగా.. రవి కృష్ణ, అఖిల్ సార్థక్, సుష్మిత, నందిత శ్వేత లు ఎంట్రీ ఇచ్చారు. వీరి ఎంట్రీతో షో మరింత రేటింగ్ తో దూసుకుపోతుందని అనుకున్నారు. కానీ గతవారం రేటింగ్ మాత్రం 3.5 కు చేరుకుంది. నిజానికి రష్మీ, సుధీర్ లు ఉన్నప్పుడు ఇటువంటి రేటింగ్ అస్సలు రాలేదు.

దీంతో వారిద్దరు లేకపోయేసరికి ఈ షో ప్రభావం తగ్గిందని అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే సుధీర్, రష్మీ ల మధ్య రొమాంటిక్ పర్ఫామెన్స్ లు, ఫన్నీ పర్ఫార్మెన్స్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ప్రస్తుతం వారిని మిస్ అవడం వల్ల ఈ షో ను చూడటానికి ఆసక్తి చూపడం లేదని అర్థమవుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *