18 ఏళ్ల తర్వాత కలసి నట్టించనున్న సూర్య-జ్యోతిక

కోలీవుడ్‌లో ఎవర్‌గ్రీన్‌ సక్సెస్ పుల్ జోడీ సూర్య, జ్యోతిక . వీరిద్దరూ జంటగా నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్‌గా నిలిచాయి. పెళ్ళయ్యాకా జ్యోతిక సినిమాలు చేయడం తగ్గించింది. చాన్నాళ్ల తర్వాత ‘36 వయదినిలే’ మూవీతో జ్యో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె నటించిన పలు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఆమె నటించిన పలు చిత్రాలకు సూర్య ప్రొడ్యూసర్ గా వ్యహరించారు. జ్యోతిక రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సూర్యతో తెరపై చూసే రోజు కోసం అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ఇక ఆ సమయం ఎంతో దూరంలో లేదనేది తాజా సమాచారం.

kollywood couple surya jyothika will be paird after a long time

ఇటీవలే ‘ఈటి’ సినిమాతో థియేటర్లకి వచ్చిన సూర్య ఆ తరువాత సినిమాలను వెట్రి మారన్ తోను .. బాలతోను చేస్తున్నారు. సూర్య కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచిన ‘పితామగన్’ హిట్ ఇచ్చింది బాలనే. అందువలన ఆయనతో ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి సూర్య ఉత్సాహాన్ని చూపుతూనే ఉంటారు. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నాడని అంటున్నారు. ఒక పాత్ర సరసన జ్యోతిక కనిపిస్తే .. మరో పాత్ర జోడీగా కృతి శెట్టి కనువిందు చేయనుందని చెబుతున్నారు.

సూర్య సినిమాలో మన కృతి శెట్టికి ఛాన్స్ వచ్చిందనే టాక్ రెండు మూడు రోజులుగా వినిపిస్తోంది. ఆమె కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చేది ఈ సినిమాతోనే కావచ్చు. ఇక ద్విపాత్రాభినయం చేయడం సూర్యకి కొట్టిన పిండే. ఇది కూడా సూర్య సొంత బ్యానర్లో చేస్తున్న సినిమానే. బాల దర్శకత్వంలో ఈ సినిమా చేయనుండటం .. సుమారు18 ఏళ్ల తర్వాత సూర్య సరసన జ్యోతిక అలరించనుండటం .. ఈ సినిమాతో కృతి శెట్టిని కోలీవుడ్ కి పరిచయం చేయడం ఈ సినిమా విశేషాలుగా చెప్పుకోవచ్చు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *