‘ఉస్తాద్’గా రాబోతున్న కీరవాణి కుమారుడు..!

‘మత్తువదలరా’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీ సింహ. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడిగా వెండితెరకు పరిచయమైనా.. మంచి నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ యంగ్‌ హీరో తాజా చిత్రం ‘ఉస్తాద్‌’. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి కీరవాణి, శ్రీవల్లి, నిర్మాత సాయి కొర్రపాటి తదితరులు హాజరయ్యారు.

Keeravani Son Sree Simha Koduri ‘s next movie ustaad launched

‘ఉస్తాద్’ సినిమాతో ఫణిదీప్ అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. సాయి కొర్రపాటి సమర్పణలో రజినీ కొర్రపాటి – రాకేష్ రెడ్డి గడ్డం – హిమాంక్ రెడ్డి దువ్వూరు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరన్ కుమార్ పుప్పాల సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. అకీవా మ్యూజిక్ అందిస్తున్నారు. కార్తీక్ కట్స్ ఎడిటింగ్.. ప్రవాలయ ప్రొడక్షన్ డిజైనింగ్ విభాగాలు చూసుకుంటున్నారు. త్వరలోనే ‘ఉస్తాద్’ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

ఎం.ఎం. కీరవాణికి రెండో కుమారుడే శ్రీ సింహా కోడూరి. ఆయనకు రాజమౌళి బాబాయ్. ‘మత్తు వదలరా’తో సింహా హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆ తర్వాత ‘తెల్లవారితే గురువారం’ సినిమా చేశారు. ప్రస్తుతం ‘భాగ్ సాలే’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాలు చేస్తున్నారు. ఈ రోజు మరో కొత్త సినిమా అనౌన్స్ చేశారు.ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత ‘ఉస్తాద్’ పదం బాగా పాపులర్ అయ్యింది. యంగ్ హీరో రామ్ పోతినేనిని ఉస్తాద్ అంటున్నారు. ఇప్పుడు ఆ టైటిల్‌తో సింహా కోడూరి సినిమా చేస్తుండటం గమనార్హం.  ఇదిలా ఉంటే వారాహి చలన చిత్ర బ్యానర్ లో గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి ని హీరోగా పరిచయం చేస్తున్న ద్విభాషా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *