ప్రభాస్‌ సినిమాకి ఆనంద్‌ మహీంద్రా సాయం..!

మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్‌తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ స్థాయిలో సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ప్రాజెక్ట్ కే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తుండగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలు పెట్టిన యూనిట్.. శరవేగంగా సినిమాను పూర్తి చేసే పనిలో ఉంది.

Anand mahindra accepts nag aswin's request to help his movie

కాగా ఈ సినిమా విషయంలో తనకు సాయం కావాలంటూ దర్శకుడు నాగ్ అశ్విన్.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను అడిగారు. మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో గానే కాదు సోషల్ మీడియాని ఫాలో అవుతున్న ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్ ఆనంద్ మహీంద్రా. ఎక్కడో మారుమూల ఉన్న ప్రతిభని వెలుగులోకి తీసుకువస్తారు. వీలైనంత సాయం చేస్తారు.. అందుకే అందరికీ మహీంద్రా ఓ మంచి రోల్ మోడల్. ఇక మన నాగ్‌ అశ్విన్‌ సాంకేతికంగా తమ సినిమాకి సాయం చేయమని ట్విట్టర్ వేదికగా రిక్వెస్ట్ చేశారు.  ‘ప్రాజెక్ట్‌ కె’ అనే ఒక ఇండియన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని… ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని మించి, ఎంతో అధునాతనమైన, విభిన్నమైన వాహనాలను ఈ సినిమా కోసం రూపొందిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఒకవేళ తమ కల నిజమైతే.. అది మన దేశానికే గర్వకారణం అన్న ఆయన భారతదేశంలో మునుపెన్నడూ ఇలాంటి సినిమా రాలేదన్నారు. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాం… కాబట్టి, ఇంజినీర్ల విషయంలో మహీంద్రా నుంచి ఏదైనా సాయం ఉంటే బాగుంటుంది అని నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌ చేశారు.

ఇక్కడ విశేషం ఏంటంటే.. నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌కు ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. ‘‘ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఎలా తిరస్కరిస్తాం నాగ్‌ అశ్విన్‌. మా ‘గ్లోబల్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌’ చీఫ్‌ వేలు మహీంద్రా మీకు కావాల్సిన సహకారం అందిస్తారు. తను ఇప్పటికే అధునాతమైన XUV700 కారుని రూపొందించారు’’ అని ఆనంద్‌ మహీంద్రా బదులిచ్చారు. ఆనంద్‌ మహీంద్రా సమాధానానికి నాగ్‌ అశ్విన్‌ ధన్యవాదాలు తెలిపారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *