డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ స్టార్ హీరోయిన్ సోదరుడు

సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ కేసులు కకావికలం చేస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్‌ను డ్రగ్స్ కేసు ఎంతో ఇబ్బంది పెట్టింది. ఆయన కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ వ్యవహారంతో తలామునకలయ్యారు షారుఖ్. ఆర్యన్‌కు ఇటీవ‌లే క్లీన్ షీట్ వ‌చ్చింది. కాగా తాజాగా మ‌రో బాలీవుడ్ సెల‌బ్రిటీ డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కున్నాడు. స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో జరిగిన ఓ పార్టీలో సిద్ధాంత్ డ్రగ్స్ సేవించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.

Siddhanth Kapoor tests positive for drugs at a rave party

ఆదివారం రాత్రి నగరంలోని ఎంజీ రోడ్డులో రేవ్ పార్టీ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రేవ్ పార్టీ జరుగుతుండడంతో 35 మంది దాకా అదుపులోకి తీసుకున్నారు. వారిలో సిద్ధాంత్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వారి శాంపిల్స్ ని పరీక్సకుల పంపగా ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయినట్టు చెప్పారు. ఆ ఆరుగురిలో సిద్ధాంత్ కూడా ఉన్నాడు. వీరిపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే వీరంతా డ్రగ్స్‌ తీసుకొని పార్టీకి వచ్చారా.. లేదా పార్టీలోనే డ్రగ్స్‌ తీసుకున్నారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రశ్నించిన వారిలో నటి శ్రద్ధా కపూర్ కూడా ఒకరు. సిద్ధాంత్‌ విషయానికొస్తే..స్టార్‌ కిడ్‌ అయినప్పటికీ డిస్క్‌ జాకీగా కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఆపై కొన్ని సినిమాల్లోనూ నటించారు. భౌకాల్, షూట్‌ ఔట్‌ వాడాలా, అగ్లీ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. ఇవి కాకుండా హసీనా పార్కర్ సినిమాలో సోదరితో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్నాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *