ధనుష్ తీసుకున్న కీలక నిర్ణయం.. షాకింగ్ లో కోలీవుడ్ ఇండస్ట్రీ!

Dhanush: టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన నటనతో అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండు వెర్షన్స్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ధనుష్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనకు తెలుసు. ప్రస్తుత స్టార్ హీరోలలో తాను ఒకడిగా వెలుగుతున్నాడు.

Dhanush
Dhanush

ఇక తాజాగా హీరో ధనుష్ తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. తన భార్య తో రిలేషన్ కి బ్రేక్ ఇచ్చినట్టు చాలా సున్నితంగా క్లారిటీ ఇచ్చారు. అర్ధరాత్రి ఈ విషయాన్ని ధనుష్ తేల్చేసి చెప్పగా.. ఈ విషయం అప్పటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విడాకులు జరగడానికి ఏం కారణం ఏమిటని నెటిజన్లు అనేక రకాలుగా చెవులు కొరుక్కుంటున్నారు.

విడాకులకు పదిహేను రోజుల ముందు ఐశ్వర్య, ధనుష్ ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ గా ఛిల్ అయ్యారు. మొన్నటికి మొన్న ఒక పార్టీలో కూడా ధనుష్ తన భార్య కోసం ప్రత్యేకంగా ఒక రొమాంటిక్ సాంగ్ పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇక సార్ సినిమా లాంచ్ కోసం ధనుష్ హైదరాబాద్ వచ్చే క్రమంలో తన భార్యను కూడా వెంటబెట్టుకుని వెళ్ళాడు.

ఇక ధనుష్, ఐశ్వర్య మధ్య సమస్య ఎప్పుడు వచ్చినా.. రజినీకాంత్ ఆ సమస్యను సర్దుబాటు చేసేవారు. కానీ ఈసారి వాళ్ళు బలమైన నిర్ణయం తీసుకోవడం తో ఆయన కూడా వారి వ్యక్తిగత నిర్ణయాన్ని ఆక్సెప్ట్ చేయక తప్పలేదని తెలుస్తుంది. రజినీకాంత్ ఈ విషయంలో ఇప్పటివరకు అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *