ఎక్స్ ప్రెస్ హరి ఫోటోను లీక్ చేసిన యాంకర్ రవి.. అలా ఉన్నావ్ అంటూ అషూ రెడ్డి కామెంట్!

బుల్లితెర ఆర్టిస్ట్ ఎక్స్ ప్రెస్ హరి గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ పరిచయమే. పటాస్ షోతో పరిచయమైన హరి మంచి పేరు సంపాదించుకొని ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు. ఆ తర్వాత పలు షో లలో కూడా అవకాశం అందుకున్నాడు. స్టార్ మాలో ప్రసారమైన కామెడీ స్టార్ షోలో కూడా పాల్గొని బాగా రచ్చ రచ్చ చేశాడు.

అందులో మరో ఆర్టిస్టు అషూ రెడ్డి తో కలిసి స్కిట్ లు చేసి బాగా హైలెట్ గా మారాడు. నిజానికి ఈ షోలో అషూ తో అతని క్లోజింగ్ చూసి చాలామంది వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అనుకున్నారు. పైగా అతడు గుండెల మీద అషూ పేరును టాటూ వేయించుకొని మరి హాట్ టాపిక్ గా నిలిచాడు. ఇక ప్రస్తుతం హ్యాపీ డేస్ అనే షో లో బాగా సందడి చేస్తున్నాడు.

ఇందులో అషు రెడ్డి తో పాటు యాంకర్ రవి కూడా బాగా హల్ చల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా యాంకర్ రవి హరి ఫోన్ లో నుంచి అతనికి తెలియకుండానే సీక్రెట్ ఫోటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక ఆ ఫోటోలో ఎక్స్ ప్రెస్ హరి అంటే గుర్తు పట్టడం చాలా కష్టం.

ఎందుకంటే ఆ ఫోటో ఆధార్ కార్డు ఫోటో అని తెలిసింది. ఇక ఈ ఫోటోను రవి షేర్ చేయగా అందులో కూడా అందంగా ఉన్నావు అంటూ అషూ రెడ్డి కామెంట్ చేసింది. ప్రస్తుతం హరి ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *